మళ్లీ భగ్గుమన్న వంట గ్యాస్ ధర.. సామాన్యుడి బతుకు బండి మరింత భారంగా...

సామాన్యుడి బతుకు బండిని మరింత భారంగా మార్చుతూ పెట్రోలియం కంపెనీలు మరోసారి గృహ వినియోగ వంటగ్యాస్ ధరలను పెంచాయి. సామాన్యుడి బతుకు బండి మరింత భారంగా.

 The Price Of Cooking Gas Has Plummeted Again , Lpg Gas , Price Hike , Once Again-TeluguStop.com

సబ్సిడీయేతర వంటగ్యాస్ ధరను 25 రూపాయల వరకు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేశాయి.తాజా పెంపుతో హైదరాబాదులో రూ.902 కి విశాఖపట్నంలో రూ.868 కి చేరునట్టయింది.కాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో 14.2 కేజీలు ఎల్ పీజీ ధర 834.5 రూపాయల నుంచి రూ.859.5 లకు పెరిగింది.ఇక ముంబైలో రూ.859.5కు చేరింది.కలకత్తా లో రూ.861 చెన్నైలో 45.5 చెల్లించాల్సి ఉంటుంది.కాగా ఉత్తర ప్రదేశ్ లోని, లక్నో ఎల్పిజి సిలిండర్ వినియోగదారులు 897.5 రూపాయలు.

  గుజరాత్లోని అహ్మదాబాద్ లో 866.5 రూపాయలు.చివరిసారిగా జూలై 1న 25.50 రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే.కాగా ఈ ఏడాదిలో ఎల్ పీజీ ఏకంగా 165.5 రూపాయల మేరకు పెరగడం గమనార్హం. గ్యాస్ ధరలు కూడా పెరగడంతో సామాన్యుడుకి భారంగా మారింది.

కరోనా కారణంగా ఎందరో జీవనోపాధిని కోల్పోయారు.పనులు దొరక్క, ఉద్యోగాలు దొరక్క సతమతమవుతున్నారు.

ఈసమయంలో వరుసగా ధరలు పెరగడం సామాన్యుడికి పెను భారంగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube