అక్కడ గుడ్డు ధర రూ.30.. కిలో అల్లం వెయ్యి.. ఎందుకో తెలుసా?

ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డు తినడం ద్వారా మన ఆరోగ్యానికి అవసరమైనన్ని పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.ఒక గుడ్డులో ఎన్నో పోషక విలువలతో పాటు అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉండడం వల్ల మన శరీర పెరుగుదలకు గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది.

 Eggs,ginger,corona Virus,pakistan, Viral In Social Media, Egg Cost 30 Rupees In-TeluguStop.com

అలాగే మన శరీరంలో ఎన్నో రకాల వ్యాధులను ఎదుర్కొని రోగనిరోధకశక్తి మెరుగుపడటం లో కూడా గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది.అందుకోసమే ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Telugu Corona, Eggs, Ginger, Pakistan-Latest News - Telugu

కరోనా వ్యాపించడంతో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరు గుడ్లను తీసుకోవడం వల్ల వాటి ధరలకు రెక్కలు వచ్చాయి.ప్రస్తుతం ఒక గుడ్డు రూ.30 పలుకుతోంది.డజన్ కోడిగుడ్లు ధర సుమారు 350 రూపాయలు ఉండటంతో ప్రజలు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అయితే ఈ ధరలు మన పక్క దేశమైన పాకిస్తాన్ లో అమలులో ఉన్నాయి.అక్కడ కిలో పంచదార100 రూపాయలు.అంతేకాకుండా కిలో అల్లం ఒకేసారి రూ.1000 పైగా ధర పలుకుతుంది.ఒక్కసారిగా ఇలా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రజలకు, తాను అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

Telugu Corona, Eggs, Ginger, Pakistan-Latest News - Telugu

ప్రస్తుతం పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పటికీ ధరలను ఏమాత్రం నియంత్రించ లేకపోయారు.కరోనా కారణం వల్ల దేశం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులలో, ఆదేశం ఆదాయాన్ని పెంచుకునేందుకు పనులను పెంచగా,ప్రజలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను డ్రా చేసుకుంటున్నారు.ఈ విధంగా డబ్బులను విత్ డ్రా చేసుకోవడం వల్ల దేశంలో నోట్ల ముద్రణ జరుగుతుంది.

ఈ విధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి.నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube