మంచు విష్ణు నిర్ణయం ఇదేనా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు షాకిచ్చే దిశగా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మంచు విష్ణు ఎన్నిక కాగా ప్రకాష్ రాజ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి 11 మంది సభ్యులు గెలవగా గెలిచిన సభ్యులు సైతం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

 The Prakash Raj Panel Members Resign Now Which Option Will Manchu Vishnu Take-TeluguStop.com

అసోసియేషన్ లో గొడవలు జరగకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని రాజీనామా చేసిన సభ్యులు వెల్లడించారు.అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేయడంతో విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అనేక సమస్యలు ఎదురు కావడంతో విష్ణు ఏ విధంగా ముందుకెళతాడో చూడాల్సి ఉంది.ఒకరో ఇద్దరో రాజీనామా చేస్తే ఏదో ఒక విధంగా వాళ్లను బుజ్జగించవచ్చు.

 The Prakash Raj Panel Members Resign Now Which Option Will Manchu Vishnu Take-మంచు విష్ణు నిర్ణయం ఇదేనా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ కు షాకిచ్చే దిశగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఏకంగా 11 మంది రాజీనామా చేయడంతో విష్ణుకు వాళ్లను బుజ్జగించే అవకాశం లేదు.‘మా’ బైలాస్ నిబంధనల ప్రకారం సభ్యులలో ఎవరైనా రాజీనామా చేస్తే వాళ్ల స్థానంలో కొత్తవారిని నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.

ప్రస్తుతం విష్ణు ముందు కొత్తవారిని నియమించడం మాత్రమే ఉన్న ఏకైక ఆప్షన్ కాగా విష్ణు ఏ విధంగా ముందుకెళతాడో తెలియాల్సి ఉంది.

Telugu Industry People, Maa Elections, Manchu Vishnu, Manchu Vishnu Maa President, Prakash Raj, Prakash Raj Panel Mambers, Prakash Raj Panel Members, Prakash Raj Panel Members Resign, Tollywood-Movie

ప్రకాష్ రాజ్ ప్యానల్ విష్ణుకు వరుసగా షాకులిచ్చే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో విష్ణు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు షాకిచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేయడం సరికాదని నమ్మి ఓటు వేసిన వాళ్ల ఆశలను అడియాశలు చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Industry People, Maa Elections, Manchu Vishnu, Manchu Vishnu Maa President, Prakash Raj, Prakash Raj Panel Mambers, Prakash Raj Panel Members, Prakash Raj Panel Members Resign, Tollywood-Movie

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఇండస్ట్రీ పెద్దలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

#PrakashRaj #MAA #PrakashRaj #PrakashRaj #Manchu Vishnu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు