ఇంకా ' కిక్ ' ఇవ్వని జగన్ నిర్ణయం ?

తాను మాటల ముఖ్యమంత్రిని కాదు, చేతల ముఖ్యమంత్రి అనే విషయాన్ని పదే పదే ఏపీ సీఎం జగన్ చెప్పుకుంటూ ఉంటారు.చెప్పడమే కాదు దానికి తగ్గట్లుగా వ్యవహారాలు చేస్తూ  ‘మాట తప్పని మడమ తిప్పను ‘ అనే డైలాగుకు కాపీరైట్స్ పొందినట్లుగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు.

 The Possibility Of A Complete Ban On Alcohol Does Not Appear In The Ap-TeluguStop.com

పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు, పేద ప్రజలు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచారు.ఏదో ఒక పథకం ప్రవేశపెడుతూనే అందరి కళ్ళల్లోనూ ఆనందం చూస్తూ వస్తున్నారు.

కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ నాంచివేత ధోరణి అవలంభిస్తుండడం, మరికొన్ని విషయాల్లో జగన్ వ్యవహార శైలి పై అనేక అనుమానాలు తలెత్తేలా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా మధ్య నిషేధం విషయంలో జగన్ నిర్ణయం ఇప్పటికీ అమలు కాలేదు.

 The Possibility Of A Complete Ban On Alcohol Does Not Appear In The Ap-ఇంకా కిక్ ఇవ్వని జగన్ నిర్ణయం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతోంది.దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తానని జగన్ చెప్పినా , ఈ నిర్ణయం అమలు అయ్యే సూచనలు కనిపించడం లేదు.

ఎందుకంటే ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం, ఇప్పుడు మద్యం ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతే ఏపీలో సంక్షేమ పథకాలతో పాటు, ఎన్నో విషయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఏపీ ప్రభుత్వం ఎదుర్కోవలసి వస్తుంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపిస్తోంది అలాగే మద్యం అమ్మే పని వేళలను తగ్గించారు.షాపుల సంఖ్య చాలా వరకు కుదించారు.గతంతో పోలిస్తే రేట్లు విపరీతంగా పెంచారు.దీని కారణంగా అయినా, మద్యం అలవాటు కు కొంత మంది దూరం అవుతారని జగన్ అంచనా వేశారు.

Telugu Ap Cm, Ap Financial Conditions, Ap Government, Ban On Alcohol, Elections, Income On Wines, Jagan, Jagan Decision, Jagan Padayathra, Wine Shops, Ysrcp-Telugu Political News

అయినా పెద్దగా మార్పు అయితే వచ్చినట్టు కనిపించడం లేదు కానీ, జగన్ మధ్య నిషేధం పూర్తిగా అమలు చేస్తారని మహిళలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.కానీ ఇంకా 3 ఏళ్ల సమయం మాత్రమే ఉంది ఈ లోపు ఆ నిర్ణయం అమలు కావడం అసాధ్యం అనే సూచనలు కనిపిస్తున్నాయి.
  ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.ఇప్పుడు మధ్య నిషేధం పూర్తిగా అమలు చేస్తే,  వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.ఎలా చూసుకున్నా, వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులే వచ్చేలాగనే కనిపిస్తున్నాయి.దీంతో జగన్ నిర్ణయం పై ఆశలు పెట్టుకున్న మహిళలకు ఇది కిక్కిచ్చే లా కనిపించడం లేదు.

 

#Ysrcp #ApFinancial #Income On Wines #AP Government #Wine Shops

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు