ఆవేశపడి ఆపై మహిళకు క్షమాపణ చెప్పిన పోప్‌

క్రైస్తవులు అంతా కూడా పరమ పవిత్రంగా భావించే వాటికన్‌ సిటీలో కొత్త సంవత్సరం వేడుకలు వైభవంగా జరిగాయి.వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ తన కోసం వచ్చిన వారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వారు చెప్పే విషెష్‌ను స్వీకరిస్తూ ముందుకు నడుస్తున్నాడు.

 The Pope Who Became Enraged And Then Apologized To The Woman-TeluguStop.com

అలాంటి సమయంలో ఒక మహిళ పోప్‌ ఫ్రాన్సిస్‌ చేయి లాగింది.దాంతో పోప్‌కు కోపం వచ్చింది.

ఆమెపై చేయి కూడా చేసుకున్నారు.ఆ వీడియోలు కాస్త సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అయ్యాయి.

పోప్‌ అయ్యి ఉండి ఒక మహిళ చేసిన తప్పుకు కొట్టాలా అంటూ ఆగ్రహం వ్యక్తం అయ్యాయి.పోప్‌ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.ఒక ఆద్యాత్మిక గురువు అలాగేనే ప్రవర్తించేది అంటూ విమర్శలు వచ్చాయి.తనపై వస్తున్న విమర్శల వల్లో లేదంటే తన తప్పును తాను తెలుసుకున్నాడో కాని వెంటనే పోప్‌ సదరు మహిళకు క్షమాపణ చెప్పాడు.

ఆ క్షణంలో తాను ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒప్పుకున్నాడు.అసలు ఆ సమయంలో నేను అలా వ్యవహరించి ఉండకూడదు అంటూ చెప్పుకొచ్చాడు.

దాంతో పోప్‌ పై వస్తున్న విమర్శలకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube