ఈట‌ల‌కు త‌ల‌నొప్పిగా మారిన చేతిగ‌డియారాల రాజ‌కీయం.. ఎంత ప‌నైపాయె!

ప‌ట్టుద‌ల‌తో ఆత్మ‌గౌర‌వ బాహుటాను ఎగ‌రేసేందుకు ఉన్న ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి మ‌రీ ఈట‌ల రాజేంద‌ర్ ఉప ఎన్నిక‌కు తెర‌లేపారు.ఇక ఆయ‌న కావాల‌ని చేసిన త‌ర్వాత గెలిచేందుకు కూడా అదే స్థాయిలో క‌ష్ట‌ప‌డుతున్నారు.

 The Politics Of Wristwatches That Have Become A Headache For Cricket .. What A W-TeluguStop.com

ఇందుకోసం ఏకంగా త‌న ఫ్యామిలీని కూడా రంగంలోకి దింపి ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క క‌ష్ట‌పడుతున్నారు.మ‌ళ్లీ గెలిస్తేనే త‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉంటుంది లేదంటే ఆయ‌న‌కు బీజేపీ కూడా ఎలాంటి గుర్తింపు ఉండ‌ద‌నేది కాద‌న‌లేని స‌త్యం.

కాబ‌ట్టే ఆయ‌న ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని గెలిచేందుకు స‌ర్వ‌శ‌క్తుల‌ను ఖ‌ర్చుపెడుతున్నారు.

ఇక ఆయ‌న స‌తీమ‌ణి జ‌మున అయితే ఎండ‌న‌క‌, వాన‌న‌క కూడా ఎన్నికల నేపథ్యంలో ఈటలను గెలిపించేందుకు విపరీతంగా శ్రమిస్తూ ఊర్ల‌ల్లో తిరుగుతున్నారు.

నిత్యం తిరుగుతుఊ ఓటర్లను కలవటం త‌మ‌కే ఓటు వేయాల‌ని కోర‌డం ఇలా వారి ప్ర‌చారం సాగుతోంది.ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో గ‌న‌క వారు ఓడితే ఈట‌ల భ‌విష్య‌త్ క‌నుమ‌రుగ‌యిపోతుంద‌ని వారికి తెలుసు కాబ‌ట్టి చావో రేవో అన్నట్లుగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో త‌న భ‌ర్త ఈటల రాజేంద‌ర్ ను గెలిపించుకునేందుకు శ్ర‌మిస్తున్నారు.

కాక‌పోతే అప్పుడ‌ప్పుడు ఆమెకు కొన్ని షాక్‌లు కూడా త‌గులుతున్నాయి.

Telugu Etala, Harish Rao, Telengana, Ts Poltics-Telugu Political News

ఇక రీసెంట్‌గా ఈటల రాజేంద‌ర్ సతీమణి అయిన జమున ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు వారికి ఈట‌ల రాజేంద‌ర్ ఫొటోల‌తో కూడిన గ‌డ‌యారాల‌ను ఇస్తూ ప్ర‌చారం చేస్తున్నారు.అయితే ఒక బాధితుడు జ‌మున ముందే ఆమె ఇచ్చిన గడియారాన్ని నేలకేసి కొట్టి మ‌రీ త‌మ‌కు ఏం చేయ‌ట్లేద‌ని, అంద‌రూ ఇలాగే చెప్తున్నారు కానీ త‌మ‌కు ఎలాంటి అభివృద్ధి చేయ‌ట్లేద‌నేది నిరసనను వ్యక్తం చేయటంతో జ‌మున వెంట‌నే షాక్ కు గురయ్యార‌ని తెలుస్తోంది.అయితే ఎప్ప‌టి నుంచో ఎమ్మెల్యేగా ఉన్న ఈట‌ల‌పై ఇలాంటి వ్యతిరేకత ఎందుకన్నదని ఆమె ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube