హుజూరాబాద్‌లో దాడుల రాజ‌కీయం.. టీఆర్ ఎస్ అలా.. ఈట‌ల ఇలా..

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు ఎంత ప్ర‌భావం చూపుతున్నాయో అంద‌రికీ విదిత‌మే.కాగా ఇక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌ని టీఆర్ఎస్‌, బీజేపీ గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నాయి.

 The Politics Of Attacks In Huzurabad Like Teresa Like Spears, Huzurabad, Eetala-TeluguStop.com

మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ఫేవ‌రెట్‌గానే ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌నే చెప్పాలి.ఆయ‌న్ను ఓడించేందుకు ఇటు టీఆర్ఎస్ కూడా బాగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

కాగా మొద‌టి నుంచి ఒకరిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకుంటూనే ఉన్నారు.ఇక ఇప్పుడు మ‌రో కొత్త ర‌కం వ్యూహానికి తెర‌లేపారు.

అదే దాడుల రాజ‌కీయం.

రీసెంట్ ఈట‌ల రాజేంద‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్లు చేశారు.

తాను అక్టోబ‌ర్ 13, 14 తేదీల్లో త‌న మీద తానే దాడి చేయించుకుంటున్న‌ట్టు ఆరోపిస్తున్నార‌ని, ఇదంతా చూస్తే టీఆర్ఎస్ మంత్రులే త‌న మీద ఏమైనా దాడికి కుట్ర‌లు చేస్తున్నారు కావ‌చ్చంటూ తెల‌ప‌డం సంచ‌ల‌నం రేపుతోంది.ఎదుకంటే తేదీల‌తో స‌హా టీఆర్ఎస్ మంత్రులు ఎలా చెబుతున్నార‌నే అనుమానాలు కూడా రాక‌పోవు.

ఇక ఈట‌ల కూడా ఈ ఆరోప‌ణ‌ల‌పై బాగానే రియాక్టు అవుతున్నారు.త‌న మీద టీఆర్ఎస్‌కు చెందిన ఓ మంత్రి కుట్ర చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు.

Telugu Eetala Rajendar, Huzurabad, Tg, Trs Ministers-Telugu Political News

దాడులు చేయించుకుంటే ప్ర‌జ‌ల నుంచి ఎలాగూ సానుభూతి వ‌స్తుంద‌నే భావ‌న‌తోనే ఈట‌ల ఇలా ప్లాన్లు చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు నిన్న‌టి నుంచి సోష‌ల్ మీడియాను కుదిపేస్తున్నాయి.సిర్సపల్లిలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా గురువారం ఇక్క‌డ నిర్వహించిన ఓ స‌భ‌లో ఈట‌ల రాజేంద‌ర్ ఆ కామెంట్లు చేశారు.దీంతో టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య కొత్త‌గా దాడుల రాజ‌కీయం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్టు అయింది.ఒక వేళ ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ మీద గ‌న‌క ఎవ‌రైనా దాడి చేసినా చివ‌ర‌కు అది టీఆర్ఎస్ మీద‌కు నెట్టే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఈట‌ల భావిస్తున్నార‌నే ఆరోప‌న‌లు కూడా వ‌స్తున్నాయి.

చూడాలి మ‌రి టీఆర్ ఎస్ మంత్రులు దీన్ని ఎలా ఎదుర్కొంటారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube