పుదుచ్చేరిలో సీయం పీఠం కోసం మొదలైన రాజకీయ రగడ.. !

దేశానికి బీజేపీ చేస్తున్న మంచి ఏంటో తెలియదు గాని ఈ మధ్య కాలంలో బీజేపీ పై మాత్రం ప్రజల్లో అసంతృప్తి రాజుకుందన్న విషయం క్షుణంగా తెలుస్తుందని అనుకుంటున్నారట.ఒకరకంగా దేశంలోని పేదలు, సామాన్యులు బాగుపడటం కంటే అంబానీ లాంటి ఫ్యామీలీలు కోట్ల ఆస్తులను కూడబెట్టుకున్నారనే ముచ్చట్లు ప్రజల్లో జరుగుతున్నాయట.

 The Political Struggle That Started For The Cm Seat In Puducherry Political Stru-TeluguStop.com

దేశంలోని అన్ని చోట్ల తమ పార్టీనే అధికారంలో ఉండాలనే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని ఇందులో భాగంగా పేద ప్రజల కష్టాలను పక్కనపెట్టిందనే అపవాదు కూడా మూటగట్టుకుంటుందట బీజేపీ.ఇకపోతే సీయం పీఠం కోసం పుదుచ్చేరిలో రాజకీయ రగడ మొదలైంది.

Telugu Bjp, Cm Seat, Nr Congress, Struggle, Puducherry, Rangaswamy-Latest News -

ఇక్కడ కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ తమకే ముఖ్యమంత్రి పీఠం కావాలంటూ పట్టు బట్టిందట.కానీ ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగస్వామి మాత్రం అలా ఎంత మాత్రమూ కుదరదని నిక్కచ్చిగా తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గిందట బీజేపీ.

ఇకపోతే పుదుచ్చేరి శాసనసభలో రంగస్వామి నేతృత్వంలో 30 మంది సభ్యులుండగా, ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా, డీఎంకే 6 స్దానాల్లో, బీజేపీ 6 స్దానాల్లో, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించారు.అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 16 మంది ఎమ్మెల్యేల అవసరం కాగా, ఎన్డీయేదే అధికారమని తేలిపోయింది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగస్వామి సిద్ధమవుతుండగా, బీజేపీ ఈ మెలికపెట్టిందట

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube