ఆ పంట సాగు చేసేందుకు రైతును అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు విషయం ఏమిటో బయటపెట్టిన పోలీసులు..!

పంట పొలాల మద్యలో మత్తు మందు పండిస్తున్నారు.కొంతమంది రైతులను పావులుగా వాడుకుంటూ చీకటి దందా కొనసాగిస్తున్నారు.

 The Police Who Arrested The Farmer To Cultivate That Crop  The Police Who Reveal-TeluguStop.com

డబ్బు మీద ఆశతో రైతులు ఈ దారుణాలకు పాల్పడి జైలు పాలవుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌ లోని మదనపల్లిలో తీగ లాగితే.

తెలంగాణలో డొంక కదులుతోంది.డ్రగ్‌ మాఫియా ఆగడాలపై అలర్ట్‌ అయిన పోలీసులు.

పంట పొలాలపై కన్నేశారు.ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ.

మత్తు పంట రాయుళ్లకు చెక్‌ పెడుతున్నారు.తాజాగా దాదాపు 20 లక్షల విలువ చేసే సరుకును సీజ్‌ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చిత్తూరు జిల్లా మదనపల్లిలో బయటపడ్డ మత్తు పంట సంచలనం సృష్టిస్తోంది.మండలంలోని మాలేపాడు, పెంచుపాడు అడవులు, పొలాల్లో సోదాలు చేశారు.టమాటా పంట మాటున గసగసాల పంట సాగవుతుందని తేల్చారు.

మాలేపాడు దేవళంపల్లెలో 15 సెంట్ల విస్తీర్ణంలో సాగు చేసిన 15వేల మొక్కలను, మూడు బస్తాల కాయలను ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మాదక ద్రవ్యాల తయారీలో ఉపయోగించే ఈ పంటను జోరుగా సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తాజాగా ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడింది.ఇక్కడ కూడా అనే నిషేధిత మొక్కలను పెంచుతున్న ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరులో లీజుకు తీసుకున్న పొలంలో ఓపియంను పండిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేశారు.ఇక తెలంగాణలో తయారు చేసి ఆంధ్రా నుంచి కర్ణాటకకు అక్రమ రవాణా చేస్తున్నారని వివరించారు.

ఒక గ్రామ్ హెరాయిన్‌ను 32 మిల్లీ గ్రాముల మార్టిన్‌తో కలిపి తయారు చేస్తున్నారని తెలిసింది.సెక్షన్ 18-బీ.

ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పోలీసు కమిషనర్ తెలిపారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరులో లీజుకు తీసుకున్న రెండు ఎకరాల పొలంలో నిషేధిత ఓపియం మొక్కలను పెంచుతున్న చెన్నకేశవులును పోలీసులు అరెస్టు చేశారు.బెంగళూరుకు తరలించడానికి సిద్ధంగా ఉన్న 390 కిలోల ఓపీఎం కాయలను పట్టుకున్నారు.390 కిలోల ఓపియం విలువ దాదాపు రూ.20 లక్షలు ఉంటుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.ప్రధాన నిందితుడు వెంకటరమణను చిత్తూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అరెస్ట్ చేసిందని సీపీ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube