లోకేష్ ని అడ్డుకుని హీరోని చేసిన పోలీసులు..!!

ఏపీలో నారా లోకేష్ బాబు ప‌లాస‌కు వెళ్లే నేప‌థ్యంలో పోలీసుల తీరు.లోకేష్ మాట్లు ఆస‌క్తి క‌రంగా ఉన్నాయి.

 The Police Made A Hero By Stopping Lokesh On His Way To Palasa Details, Nara Lok-TeluguStop.com

లోకేష్ మాట్లాడిన మాట‌లు ఆలోచించే విధంగా ఉన్నాయి.ఉన్నతాధికారుల ఆదేశాలు అనుసరించి ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు.

వీలున్నంత వరకూ టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో శ్రీకాకుళం నుంచి విశాఖ వరకూ నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి.

వివాదాస్పద పలాస ప్రాంతానికి వెళ్లేందుకు వీల్లేదని నారా లోకేశ్ ను తొలుత కొత్త రోడ్డు దగ్గర అడ్డుకుని జేఆర్ పురం స్టేషన్ కు తరలించారు.ఆ అరెస్టు సందర్భంగా కూడా చాలా గందరగోళం నెలకొంది.

అంతేకాదు టీడీపీ నాయకులు చాలా మంది కళా వెంకట్రావు మొదలుకుని చౌదరి బాబ్జీ వరకూ అరెస్టును ప్రతిఘటిస్తూ రోడ్డుపై బైఠాయించారు.లోకేశ్ కూడా చాలా సేపు రోడ్డుపై బైఠాయించారు.

అయితే లోకేష్ మాట్లాడుతూ.నన్ను మాట్లాడనివ్వండి.మీరు ఇచ్చిన నోటీసులు చదివాను.మీరు మరీ.! హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు.నేనొక శాసన సభ్యుడిని.

మీరు ఇచ్చిన నోటీసుల్లో ఏముందో పూర్తిగా అర్థం చేసుకున్నాను.అయినా రోడ్డు మీద ఓ గౌరవ శాసన సభ్యుడిని అవమానించడం ఎంత వరకు సబబు.

మీరు వెళ్లవద్దన్నారు కనుక మేం పలాసకు వెళ్లడం లేదు.మీరు నోటీసులు ఇచ్చారు కనుక మేం వాటిని పరిగణిస్తున్నాం.

ఇదే సమయంలో మీరు కనీసం నన్ను మాట్లాడనివ్వడం లేదు.ప్రివెంటివ్ అరెస్టులు చెప్పి మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ విశాఖ కేంద్రంగా.అంతకుమునుపు శ్రీకాకుళం కేంద్రంగా పోలీసు ఉన్నతాధికారులతో లోకేశ్ మాట్లాడారు.

విప‌రీత‌మైన క్రేజ్.

Telugu Ap, Cmjagan, Lokesh Babu, Lokesh Palasa, Srikakulam, Vijayanagaram, Vizag

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన నేతలు తరలి రావడంతో లోకేశ్ పర్యటనకు విపరీతం అయిన క్రేజ్ వచ్చింది.మీడియాలో అటెన్షన్ వచ్చింది.పోలీసులు అత్యంత అమానవీయ ధోరణిలో తమ విషయమై ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ పదే పదే లోకేశ్ ఈ విషయాలను మీడియా దృష్టికి తీసుకువచ్చారు.అదేవిధంగా విశాఖ ఏసీపీ తో కూడా ఇవే మాటలు చెప్పి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని అన్నారు.

రెండు సార్లు మీడియా మీట్ ను ఆపే ప్రయత్నం చేసిన విశాఖ ఏసీపీని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.ఆ తర్వాత కూడా గందరగోళ వాతావరణం నడుమే లోకేశ్ మాట్లాడారు.

ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాక.

ఆ త‌ర్వాత విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నా లోకేష్ అక్కడ కూడా ఎంట్రన్స్ గేట్ దగ్గర బైఠాయించి నిరసన వ్య‌క్తం చేశారు.కేవలం తమను అడ్డుకునేందుకే ఇంతగా పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఇదే చొరవ పేదల విషయమై చూపితే వారికి న్యాయం దక్కేది ఎద్దేవా చేశారు.ఇక పోలీసు చర్యలన్నీ ఏకపక్షంగానే ఉన్నాయని.

ఇవన్నీ నిరంకుశత్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని టీడీపీ నాయకులు ఆరోపించారు.

Telugu Ap, Cmjagan, Lokesh Babu, Lokesh Palasa, Srikakulam, Vijayanagaram, Vizag

అయితే ఇవన్నీ ఉన్నతాధికారుల ఆదేశాలేనని తామే చేయలేమని క్షేత్ర స్థాయిలో పనిచేసిన పోలీసులు నిన్నటి వేళ లోకేశ్ కు చెప్పే ప్రయత్నం చేశారు.తాను చట్టాలను గౌరవిస్తానని అంటూనే ప్రజా స్వామ్య దేశంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ హక్కులు ఉంటాయని హితవు ప‌లికారు.అదేవిధంగా పోలీసులు ఓ గౌరవ శాసనసభ్యుడి విషయమై నడుచుకునే పద్ధతి ఇది కాదని.

తామేం లా అండ్ ఆర్డర్ ను డిస్ట్రబ్ చేయడం లేదని వ్యాఖ్యానించారు.ఆ విధంగా విపక్ష నేతలు లోకేశ్ తో సహా ఇతర నాయకులు తమ దైన పోరాటం సాగించి తమ నిరసనలు తెలిపి తాము చెప్పాలనుకున్నదేదో చెప్పారు.

ఇలా ఉంటే జ‌గ‌న్ పాద‌యాత్ర చేసేవారా.?

ఇక వైసీపీ సర్కారు హయాంలో ఎప్పటి నుంచో నెలకొన్న సంస్కృతి మాట్లాడేవారిని మాట్లాడనివ్వకపోవడమేనని ఇదే సంస్కృతిని ఆ రోజు తాము అమలు చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని లోకేశ్ ప్రశ్నించారు.ప్రశ్నిస్తే చాలు ఇంటికి జేసీబీని పంపిస్తున్నారని ఇంత కన్నా దారుణం ఇంకేమయినా ఉంటుందా అని లోకేశ్ ఆవేదన చెందారు.ఇదే వాదన పోలీసుల ఎదుట మీడియా ఎదుట వినిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube