అలా వ‌చ్చార‌ని బాధితుల‌ను లోప‌ల‌కు రానివ్వ‌ని పోలీసులు..!

మన దేశంలో పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన ఆఫీసు.న్యాయం కోసం బాధితులు ఇక్కడకు ఎల్లవేళలా వస్తుంటారు.

 The Police Did Not Allow The Victims To Come Inside-TeluguStop.com

తగదాలు, కొట్లాటలు ఇతర అనేక విషయాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వస్తుంటారు.కాగా, తమకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చిన బాధితులను వెనక్కి పంపి విమర్శల పాలవుతున్నారు ఈ ఏరియా పోలీసులు.

ఇంతకీ బాధితులు పోలీస్ స్టేషన్‌కు ఎలా వచ్చారు? ఏ ప్రాంత పోలీసులు బాధితులను ఇబ్బందులు పెట్టారు? సోషల్ మీడియాలో ఈ విషయం ఎందుకు వైరలవుతోంది? తెలియాలంటే మీరు ఈ స్టోరీ ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.

 The Police Did Not Allow The Victims To Come Inside-అలా వ‌చ్చార‌ని బాధితుల‌ను లోప‌ల‌కు రానివ్వ‌ని పోలీసులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు వింత అనుభవం ఎదురైంది.

వివరాల్లోకెళితే.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దత్తా, అవిశేక్ బిశ్వాస్ ఇటీవల కాలంలో కోల్‌కత్తాలోని కస్బ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

తమ ఏరియాలోని ఓ ఆలయంలో చోరీ జరగగా, ఆ విషయమై కంప్లయింట్ చేసేందుకు వెళ్లారు.కాగా, అక్కడి పోలీసులు వారు షార్ట్ మీద వచ్చారంటూ ఓవర్ యాక్షన్ చేశారట.

ఇద్దరు వ్యక్తులు షార్ట్ ధరించి వచ్చిన కారణంగా పీఎస్‌లోనికి వెళ్లకూడదంటూ ఓ సివిల్ పోలీసు అడ్డుకున్నాడు.ఈ క్రమంలోనే షార్ట్‌లో వస్తే పీఎస్‌లోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పాడు.

అయినా ఏదోలా సదరు ఖాకీకి సర్దిచెప్పి స్టేషన్‌లోకి వెళ్లారు దత్తా, అవిశేక్ బిశ్వాస్.అక్కడ కూడా అదే సమస్య తలెత్తింది.

డ్యూటీ ఆఫీసర్ వారి దగ్గరి నుంచి కంప్లయింట్ తీసుకోపోగా, అందుకు నిరాకరించాడు.పీఎస్‌లో మహిళా పోలీసులున్నారని చెప్పాడు.

తిరిగి ఇంటికి వెళ్లి ప్యాంట్‌లు ధరించి వస్తేనే కంప్లయింట్ తీసుకుంటామని చెప్పారు.ఇక చేసేదేమీ లేక వారిరువురు ఇంటికెళ్లి ప్యాంట్ వేసుకుని వచ్చి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కాగా, ఈ విషయమై స్పష్టతనివ్వాలంటూ బాధితులు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

మీ ఆఫీసులకు అలానే షార్టుల మీద వెళ్తారా? కోల్‌కత్తా పోలీసులు ట్విట్టర్‌లో ప్రశ్నించారు.మొత్తంగా కోల్‌కత్తా పోలీసులు డ్రెస్ విషయమై విమర్శలపాలయ్యారు.

అయితే, ఫిర్యాదు చేసేందుకు గాను ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండబోదని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

#Different Scene #ThePolice #Police #Dutta #Kolkata

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు