పోలీసులు నన్ను విడిచి పెట్టేందుకు 15 లక్షలు లంచం అడిగారు...

టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న నటి గేహానా వశిస్ట్ సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అయింది.

 The Police Demanded A Bribe Of Rs 15 Lakh To Release Me-TeluguStop.com

కాగా ఆ మధ్య ఈ అమ్మడికి వ్యభిచార సంబంధిత కార్యకలాపాలలో హస్తం ఉందని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా గేహానా వశిస్ట్ ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది.

 The Police Demanded A Bribe Of Rs 15 Lakh To Release Me-పోలీసులు నన్ను విడిచి పెట్టేందుకు 15 లక్షలు లంచం అడిగారు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తను ఎలాంటి అపరాధం చేయకున్నప్పటికీ పోలీసులకు చిక్కినందుకు 15 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని అడిగారట.అంతేకాకుండా తమకు అడిగినంత డబ్బు ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కేసు నుంచి తప్పిస్తామని లేకుంటే అనవసరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడ్డారట.

అయినప్పటికీ తాను లొంగక పోవడంతో తనతో వాట్సాప్ లో చాట్ చేసినందుకు మరో ఇద్దరి దగ్గర 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారట.దీంతో గేహానా వశిస్ట్ పోలీసుల పై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా గేహానా వశిస్ట్ తెలుగులో ప్రముఖ సీరియల్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన ఆపరేషన్ దుర్యోధన చిత్రం లో స్పెషల్ సాంగ్ లో నటించింది.అలాగే మరో ఐదు చిత్రాలలో హీరోయిన్ గా నటించి బాగానే అలరించింది.కానీ అనుకోకుండా అశ్లీల చిత్రాలు వ్యవహారం మరియు వ్యభిచార కార్యకలాపాలను కేసులో పోలీసులకు చిక్కడంతో దాదాపు సినిమా కెరీర్ ముగిసిపోయింది.

#Gehana Vasist #Inter View #15 Lacs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు