సినిమాల‌ను త‌ల‌ద‌న్నే రీతిలో పోలీసుల ఛేజింగ్ సీన్‌..

సాధారణంగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేయడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం.రియల్ లైఫ్‌లోనూ అటువంటి సీన్స్ ఉంటాయి.

 Police Chasing Scene In The Same Way As Movies, Police Chasing, Viral Video, Tam-TeluguStop.com

కానీ, అవి మనందరికీ కనబడకపోవచ్చు.తాజాగా సినిమాను తలదన్నే రీతిలో గ్యాంగ్‌స్టర్స్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.సదరు వీడియోను చూసి నెటిజన్లు పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

వివరాల్లోకెళితే.తమిళనాడులోని కాంచీపురంలో ఇటీవల కాలంలో దొంగలు రెచ్చిపోయారు.

కార్లను వరుసగా దొంగలిస్తూ అటు కార్ ఓనర్స్, ఇటు పోలీసు ఆఫీసర్స్‌కు సవాల్ విసురుతున్నారు.ఈ నేపథ్యంలో దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

ఇద్దరు దొంగలను పట్టుకునేందుకుగాను వారు ఛేజింగ్ చేసి ఎట్టకేలకు పట్టుకున్నారు.చోరీలకు పాల్పడుతున్న వెంకటేశ్ గ్యాంగ్ పని పట్టారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా, ప్రజలు పోలీసుల పనితీరు పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే, ఈ క్రమంలోనే వెంకటేశ్ గ్యాంగ్‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న పోలీసులను అప్రమత్తం చేశారు పోలీసు అధికారులు.

తంజావూర్ జిల్లా పట్టుకొట్టైలో పోలీసుల తనిఖీలో దొంగలించబడిన కారును పోలీసులు గుర్తించారు.అలా వెంకటేశ్ గ్యాంగు పట్టుకునేందుకు పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ ప్రయత్నించాడు.

ఈ నేపథ్యంలోనే తప్పించుకునేందుకు ప్రయత్నించిన వెంకటేశ్ గ్యాంగ్ సభ్యులు ఇద్దరిని పోలీసులు ఛేజ్ చేసి మరి కటకటాల్లోకి నెట్టేశారు.

అయితే, వెంకటేశ్ గ్యాంగ్‌లో మరో నలుగురు తప్పించుకోగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.ఇకపోతే దొంగతనాలకు పాల్పడుతున్న వెంకటేశ్ గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు కానిస్టేబుల్‌ను పోలీసు అధికారులు ప్రశంసించారు.ఈ క్రమంలోనే మిగిలిన గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయితే, చోరీలు చేసే బ్యాచ్ గ్యాంగ్ లీడర్ వెంకటేశ్ పోలీసులకు చిక్కాడు.అతడి ద్వారా ఇప్పటి వరకు దొంగలించబడిన కారుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయనున్నారు.

మొత్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉండి తొందరంగా వెంకటేశ్ గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడం పట్ల చోరీ కాబడిన కార్ల ఓనర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube