వైరల్ వీడియో: కన్న కొడుకు ముందే ఆ తండ్రిని పోలీసులు ఏకంగా..?!

అప్పుడప్పుడు కొన్ని సంఘటనల నడుమ పోలీసులు ప్రజలని ఇష్టమొచ్చినట్లు కొడుతూ వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లే ఎన్నో వీడియోలను మనం మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా రాజస్థాన్ ( Rajasthan )రాష్ట్రంలో కొందరు పోలీసులు కన్న కొడుకు ముందే తండ్రి దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 The Police Arrested The Father Before The Son Saw The Viral Video, In Jaipur, Po-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్( Jaipur in Rajasthan ) నగరం దగ్గరగా ఉన్న జైసింగ్ పుర ప్రాంతంలోని భంకత్రోటలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.ఇక అక్కడే స్థానిక వార్తల ప్రకారం.పోలీసులు కొట్టిన వ్యక్తిని 35 ఏళ్ల చిరంజిలాల్ ( Chiranjeelal )గా చెబుతున్నారు.

ఆయన వృత్తిరీత్యా ఓ చార్టెడ్ అకౌంటెంట్.ఈయన ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సిఏ గా పని చేస్తున్నారు.

ఇకపోతే సదరు బాధితుడు గత ఏడాది కాలంగా తన భార్యతో వివాదాల మధ్య నలిగిపోతున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ.

సంఘటన జరిగిన రోజు పోలీసులతో పాటు సదరు వ్యక్తి భార్య కలిసి వారి ఇంటి తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు.

ఈ ఘటనలో ఇంటి తాళాలు ఎందుకు పగలగొట్టారన్న చిరంజీలాల్ ప్రశ్నలకు.పోలీసులు అతనిపై విరుచక పడ్డారు.ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియోలో చిరంజీలాల్ కొడుకు మోకాళ్ళపై కూర్చొని చేతులు జోడించి తన తండ్రిని కొట్టవద్దని పోలీసులను వేడుకున్న గాని వారు ఎలాంటి కనికరం కూడా చూపించకుండా చావబాదారు.ఈ ఘటనలో కొడుకు పోలీసుల పాదాలను తాకడం కూడా మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చేసిన దాడికి సంబంధించి ఉన్నత పోలీసు అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube