గంగూలికి క్రికెట్ చరిత్రలో ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆయన ఇండియన్ క్రికెట్లో ఓ లెజెండ్.
ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో దాదా అంటే కోట్లాది మంది అభిమానులు మురిసిపోతూనే ఉంటారు.అంతలా ఆయన క్రికెట్‌ను ప్రభావితం చేశారు.
ఎన్నో అవార్డులు, రికార్డులను ఆయన తన పేరిట నమోదు చేశారు గంగూలి.అయితే ఇప్పుడు ఆయన పేరుమీద ఉన్న ఓ అరుదైన రికార్డు బద్దలయింది.
అదేంటో ఇప్పుడు చూద్దాం.
సౌరవ్ గంగూలీ టీమిండియాలో చెక్కుచెదరని రికార్డులు ఎన్నో తన పేరుమీద రిజిస్టర్ చేశాడు.
లార్డ్స్‌లో 1996లో తన మొదటి ఇన్నింగ్స్‌లో 131పరుగులు చేసి అద్భుతమన రికార్డును రిజిస్టర్ చేశాడు గంగూలి.అయితే ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఆ రికార్డును న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్ డెవాన్ కాన్వే(136 బ్యాటింగ్) బద్దలు కొట్టాడు.25ఏళ్ల క్రితం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లో ఆరంగ్రేటం మ్యాచ్‌లో గంగూలీ 131పరుగులు చేసి ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇప్పటి వరకు తొలి ఇన్నింగ్స్‌లో అన్ని పరుగులు ఎవరూ చేయలేదు.కానీ ఇప్పడు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో జరుగుతోంది.మ్యాచ్ మొదటి రోజు, న్యూజిలాండ్ ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 246 రన్స్ చేసి భారీ స్కోరు చేసింది.
ఈ మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే అద్భుతమైన సెంచరీ చేశాడు.మ్యాచ్ మొదటి రోజు, టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదటగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
దీంతో వచ్చిందే అవకాశం అన్నట్టు రెచ్చిపోయిన డెవాన్ కాన్వే టామ్ లాథమ్‌తో కలిసి ఇన్నింగ్స్ పరుగులు పెట్టించాడు.మొదటి వికెట్‌కు 58 పరుగులు జోడించగా, లాథమ్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.అయినా సరే కాన్వే ఎక్కడా తగ్గకుండా భారీ స్కోరు చేస్తున్నాడు.మొదటి ఇన్నింగ్స్‌లో ఇన్ని పరుగులు చేయడం ఇదే ఆధిక్యం.
తాజా వార్తలు