వంతెన కింద చేరిన విమానం.. ఇరుక్కున్నదాన్ని ఏం చేశారంటే..?!

సాధారణంగా వంతెన కింద బారీ వాహనాలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.పెద్ద పెద్ద ట్రక్కులో లేకుంటే భారీ లోడ్ తో వెళ్తున్న లారీలో వంతెనను దాటుకునేందుకు కాస్త అవస్థలు పడాల్సి ఉంటుంది.

 The Plane That Reached Under The Bridge .. What Did You Do To Get Stuck Viral-TeluguStop.com

ఇదంతా కొన్ని చోట్ల మాత్రమే.చాలా చోట్ల వంతెనలు పెద్దవిగా ఉండటం వల్ల అక్కడున్న వాహనాలకు ఎటువంటి ఇబ్బంది రాదు.

అయితే ఇక్కడొక వాహనం వంతెన కింద ఇరుక్కుపోయింది.అది ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఎయిర్‌ ఇండియాకు చెందిన ఒక విమానం వంతెన స్ట్రక్ అయిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీలోఈ ఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరలో ఢిల్లీ-గుర్గావ్ హైవేపై విమానం వంతెన కింద ఇరుక్కుపోవడం కలకలం రేపింది.రోడ్డుకు ఒక వైపు వాహనాలు వెళ్తున్నాయి.ఇంకో వైపుగా వంతెన వంతెన కింద విమానం ఇరుక్కుపోయింది.ఈ విమానానికి రెక్కలు లేవు.

వాహనదారులు ఇరుక్కు విమానాన్ని వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.

ఈ ఘటన జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా దీనిపై రియాక్ట్ అయ్యింది.ప్రమాదం జరగలేదని చెప్పింది.ఈ మధ్య ఎయిర్ ఇండియా తమ పాత వాహనాలను అమ్ముతోంది.అందులో భాగంగా ఓ వ్యక్తి పాత విమానాన్ని కొన్నాడు.ఆ విమానాన్ని ట్రాలీలో తరలిస్తుండగా విమానం వంతెన కింద స్ట్రక్ అయిపోయింది.ఈ ఘటన జరగడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఎయిర్ ఇండియా తెలిపింది.

అయితే ఆ పాటికే ఈ విమానం ఇరుక్కు పోవడం గురించి చాలా మంది సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేశారు.విమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సర్వీస్‌లో లేని ఎయిర్‌ ఇండియా విమానం వంతెన కింద ఇరుక్కుందని, పొటీ ఇప్పుడు ప్రారంభమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube