ఆ వ‌ర్గాల‌ను వైసీపీకి దూరం చేసేలా ప్లాన్ వేస్తున్న ప‌వ‌న్‌..

పార్టీలు ఏవైనా స‌రే కొన్ని వ‌ర్గాల అండ‌తోనే అధికారంలోకి వ‌స్తుంటాయి.అన్ని వ‌ర్గాల‌ను ఒకే దృష్టి కోణంలో చూడ‌కుండా ఆయా వ‌ర్గాల‌కు సెప‌రేటు స్థాయి క‌ల్పించి వారి అండ‌దండ‌ల‌ను సంపాదిస్తే గ‌న‌క త‌ప్ప‌కుండా అధికారంలోకి రావ‌డం ఖాయ‌మే.

 The Plan Is To Distance Those Communities From The Ycp.., Ycp, Pawan,ap News-TeluguStop.com

ఈ విష‌యంలో గ‌తంలో టీడీపీ బీసీ వ‌ర్గాల అండ‌తో అధికారంలోకి వ‌చ్చింది.కానీ చంద్ర‌బాబు నాయుడు ఆ వ‌ర్గాల‌ను త‌న చేష్ట‌ల‌తో దూరం చేసుకోవ‌డంతో ఆయ‌న అధికారం కోల్పోయారు.

ఆ త‌ర్వాత వారిని జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డంతో ఆయ‌న అధికారాన్ని ద‌క్కించుకున్నారు.

కాగా ఇప్పుడు జ‌నసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి రూటునే ఎంచుకుంటున్నారు.

తాను రాజ‌కీయాల‌లో కులాల ప్ర‌స్తావ‌న తీసుకురాన‌ని కులాల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయాలు చేస్తానంటూ చెప్పారు.కానీ అలా కులాల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయాలు చేస్తే అధికారం ద‌క్క‌ద‌ని ఆయ‌న‌కు కూడా అనుభ‌వం అయిపోయింది కాబోలు.

అందుకే ఆయ‌న కూడా కులాల‌ను ద‌గ్గ‌ర చేసుక‌నే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశారు.ఈ మ‌ధ్య పవన్ కు జ‌గ‌న్ మీద వ్యక్తిగతంగా చాలా కోపం కూడా పెరిగిపోతుంది.

అందుకే ఆయ‌న కొత్త ప్లాన్ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu Ap, Chandra Babu, Jagan, Jansena, Pavan Kalyan, Pawan, Ysrcp-Telugu Polit

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించేసి త‌న పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల‌ని ఆయ‌న ప‌ట్టు మీద ఉన్నారు.ఇందుకోసం కమ్మ సామాజికవర్గాన్ని ఆయ‌న ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా భుజానికెత్తుకుంటున్నారు.నిజానికి తెలుగు దేశానికి అండ‌గా ఉంటున్న క‌మ్మ సామాజిక వ‌ర్గం చాలా బ‌ల‌మైంది.ఇప్ప‌టికే కాపుల స‌పోర్టు ఎలాగూ ప‌వ‌న్‌కు ఉంది.కాబ‌ట్టి ఇటు క‌మ్మ వారిని ద‌గ్గ‌ర‌కు చేసుకుని అలాగే బీసీలను కూడా త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నంలో ప‌డ్డారు ప‌వ‌న్‌.ఈ రెండు వ‌ర్గాలు వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నాయి కాబ‌ట్టి వారిని త‌న వైపు తిప్పుకుంటే జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టొచ్చ‌ని చూస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube