విమానం నడుపుతూ స్పృహతప్పిన పైలెట్.. ఏమైందంటే?

సపోజ్ మనం బస్సులో కానీ కారులో కానీ వెళ్తున్నాం అనుకుందాం.ఉన్నట్టుండి డ్రైవర్ స్పృహ తప్పితే.

 The Pilot Who Lost Consciousness While Flying The Plane .. What Happened, Pilot-TeluguStop.com

ఎలా అయినా బ్రేక్ పై కాలు వేసి.వాటిని ఆపుచేయడానికి ప్రయత్నిస్తాం.

ఆ తర్వాత డ్రైవర్‌ని కాపాడే పని ప్రారంభిస్తాం.కానీ అలాంటిదే ఒకవేళ విమానంలో జరిగితే ఎలా? విమానంలో ఒకవేళ పైలెట్ స్పృహ తప్పితే ఎలా? అమెరికాలోని.సెస్నా 208 కారవాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సరిగ్గా ఇలాగే జరిగింది.ఒక చిన్న విమానం పైలట్ కాకుండా 14 మంది ప్రయాణికులతో కలిసి.బహమాస్‌ లోని మార్ష్ హార్బర్ దగ్గరున్న లియోనార్డ్ ఎం థాంప్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్లోరిడా కి బయలుదేరింది.ఫ్లైట్ గాలిలో ఎగురుతున్నప్పుడు.

పైలట్ స్పృహతప్పాడు.ఏం చేసినా అతనికి స్పృహ రాలేదు.

ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయం మొదలైంది.ఏం చేయాలో తెలియని పరిస్థితి.ఇంతలో తన ప్రెగ్నెంట్ భార్యతో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి… గబగబా పైలట్‌ని పక్కకు జరిపి… పైలెట్ సీట్లో కూర్చున్నాడు.ఫోర్ట్ పియర్స్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో టచ్‌లో ఉంటూ.

ఇప్పుడు ఏం చెయ్యమంటారు అని అడిగాడు.నిజానికి అతనికి ఎలాంటి అనుభవమూ లేదు.

అయినప్పటికీ వాళ్లు ఏం చెబితే అది చేయసాగాడు.పైలట్ స్పృహ తప్పిన సమయంలో విమానం ఫ్లోరిడా తీరంపై ఎగురుతూ ఉంది.

మరో 105 కిలోమీటర్ల అవతల డెస్టినేషన్ ఉంది.

విమానంలో మిగతా ప్రయాణికులను తమ తమ సీట్లలోనే ఉండమన్నాడు.కానీ వాళ్లు అతని వెనకాలే ఉండి అంతా చూడసాగారు.ఏమైతేనేం… అతను విమానాన్ని పామ్ పీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు.అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube