చెత్త కామెంట్స్ పెట్టాడు ... చిప్పకూడు తింటున్నాడు  

నరం లేని నాలుకను అదుపులో పెట్టుకోవాలి లేకపోతే తిప్పలు తప్పవు అని పెద్దలు అంటూ ఉంటారు. అయితే.. కాలం మారింది కదా ..! సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాయడం.. పిచ్చ పిచ్చ కామెంట్స్ చేయడం రెండూ… ప్రమాదమే అని ఓ ప్రబుద్దుడికి బాగా తెలిసొచ్చినట్టు ఉంది. అందుకే ఇప్పుడు అతను చేసిన పనికి కుయ్యో మొర్రో అంటూ వేడుకున్నా … లాభం లేకుండా పోయింది.

The Person Who Went To Jail For Controversial Comments-

The Person Who Went To Jail For Controversial Comments

అభిజిత్ మిత్రా అనే వ్యక్తి హిందూ దేవతలపై వివాదస్పద కామెంట్స్ చేసి జైలు పాలయ్యాడు. 40 రోజులకు పైగా ఆయన జైలుజీవితం గడుపుతున్నాడు. తప్పయింది మన్నించండి బాబు.. మరోసారి ఇలాంటివి చేయను అని కోర్టు ముందు మొరపెట్టుకున్నా.. కోర్టులు కనికరించడం లేదు. అక్టోబర్ 23 నుంచి ఒడిశాలోని జైల్లో బిక్కుబిక్కుమంటున్నాడు.కొద్ది రోజుల క్రితం ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయాన్ని సందర్శించిన ఢిల్లీ బేస్డ్ డిఫెన్స్ స్పెషలిస్ట్ అభిజిత్ అయ్యర్.. దేవాలయ గోడల మీద నగ్నంగా ఉన్న చిత్రపటాలపై తన ట్విట్టర్ అకౌంట్లో వెకిలి కామెంట్ చేశాడు. అది హిందువుల మనోభావాలు తీవ్రంగా కలచివేసింది. దాన్ని చాలా మంది ఖండించారు. అయితే దానికి మళ్లీ రిప్లయి ఇస్తూ మళ్లీ అలాంటి కామెంటే చేశాడు.

The Person Who Went To Jail For Controversial Comments-

అంతేకాదు.. అభిజిత్ బ్రిటిష్ వలసపాలకుల చట్టం పరిధిలో డిఫమేషన్ కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు. అందులో కనీసం రెండింటి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. వాటిల్లో ఒకవేళ దోషిగా తేలితే అభిజిత్ కు 5 ఏళ్ల జైలు శిక్ష ఖాయం అంటున్నారు. అభిజిత్ నిర్వాకం మీద ఒడిశా మొత్తం ధర్నాలతో అట్టుడికింది. 78 రోజులుగా ఒడిశాలో లాయర్లు స్ట్రైక్ చేస్తున్నారు. జనజీవితం స్తంభించింది. ఇక విచారణలో ఉన్న ఖైదీగా జైల్లో ఉన్న అభిజిత్.. ఎట్టకేలకు దారికొచ్చాడేమో.. తాను చేసిన పనికి క్షమించుమని ఒడిశా శాసనకర్తలను వేడుకున్నాడు.

The Person Who Went To Jail For Controversial Comments-

పోలీసులు మాత్రం కేసు పెట్టారు. అందులో లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆయన సాక్షుల్ని భయపెట్టవచ్చని, సాక్ష్యాలను కూడా మార్చవచ్చంది. సుప్రీంకోర్టు కూడా బెయిల్ కు నిరాకరించింది. అభిజిత్ మత భావనల్ని చులకన చేసి మాట్లాడాడని, ఆయన తన సేఫ్టీ గురించి భయపడితే.. అందుకు జైలే సురక్షితమైన ప్లేస్ అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రపంచ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇలా వెకిలి కామెంట్లు చేసిన ఫలితంగా అభిజిత్ అయ్యర్ 41 రోజులుగా జైల్లోనే కాలం గడుపుతున్నాడు.