బ‌తికున్న పామును అమాంతం మింగేసిన వ్య‌క్తి.. కానీ చివ‌ర‌కు

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న కొన్ని వీడియోల‌ను చూస్తుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది.క‌ల‌చివేసే విధంగా అవి ఉంటున్నాయి.

 The Person Who Swallowed The Snake Alive But To The End , Snake, Viral News-TeluguStop.com

మ‌రీ ముఖ్యంగా జంతువులు లేదంటే పాముల‌కు సంబంధించిన వీడియోల్లో మ‌నుషులు కూడా ఉంటే ఇంక వాటికి ఉండే రేంజ్ వేరే లెవ‌ల్ అని చెప్పేయాలి.మామూలుగానే జంతువుల‌కు సంబంధించిన వీడియోల‌కు బాగా ఆద‌ర‌ణ ఉంటుంది.

అలాంటిది ఇక వాటితో పాటు అందులో మ‌నుషులు కూడా ఉంటే దానికి ఉండే ఇంపాక్ట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇక ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి పాముతో చేసిన సాహ‌సం బాగా పాపుల‌ర్ అవుతోంది.

పాము అంటేనే మ‌నకు చాలా భ‌యం వేస్తుంది.అది వ‌స్తుందంటేనే ఆమ‌డ దూరం ప‌రిగెత్తుతాం.

దానికి చిక్కామంటే మ‌న ప్రాణాల‌ను దాని చేతిలో పెట్టేసిన‌ట్టు అవుతుంది.అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు ఓ వ్యక్తి ఏకంగా పామునే తినేశాడు.అది కూడా ఆ పాము సజీవంగా ఉండ‌గానే అమాంతం మింగేశాడు.

వినటానికే షాకింగ్‌గా ఉన్నా కూడా ఇదే నిజం.రష్యాలో నివ‌స‌సి్తున్న 55 ఏళ్ల వ్య‌క్తి కి సంబంధించిన వీడియో ఇది.

ఇందులో మ‌నం చూస్తే అత‌నికి దొరికిన పామును అమాంతం బ‌తికుండ‌గానే మింగేందుకు రెండు సార్లు ప్ర‌య‌త్నిస్తాడు.కానీ కుద‌ర‌దు.

ఇక మూడో సారి కూడా అలాగే ప్రయత్నిస్తుండగా పాము ఒక్క‌సారిగా రియాక్ట్ అయ్యి ఆ వ్య‌క్తి నాలుకకు కాటు వేయ‌డాన్ని మ‌నం చూడొచ్చు.అయితే ఆ వ్య‌క్తి కాటు వేసినా అలాగే మింగేందుకు ప్రయత్నిస్తాడు.

ఇక ఆ పాము గొంతు లోపలకు వెళ్లిన త‌ర్వాత మరోసారి కాటేస్తుండ‌టం గ‌మ‌నార్హం.ఇక రెండుసార్లు కాటు వేయ‌డంతో అత‌ని ఆరోగ్యం క్షీణించటంతో అత‌న్ని ఆస్ప‌త్రికి తీసుకెళ్తారు.

అయితే చివ‌ర‌కు అత‌ను విషం కార‌ణంగా మ‌ర‌ణిస్తాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube