విస్త‌రాకుల్లో పాణీపూరీలు అమ్ముతున్న వ్య‌క్తి.. సూప‌ర్ అంటున్న ప‌బ్లిక్‌

పాణీ పూరి. ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్లూరుతాయి.

 The Person Who Sells Panipuris In Leaves Super Says Public Details, Panipuri, Vi-TeluguStop.com

ముఖ్యంగా అమ్మాయిల‌కు మాత్రం పానీ పూరీ అంటే ఓ ర‌క‌మైన ఇష్టం.అందుకే వారు దాన్ని చాలా ఇష్టంగా తింటుంటారు.

చిన్న పిల్ల‌ల ద‌గ్గరి నుంచి పెద్ద వారి దాకా అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఐట‌మ్ గా మారిపోయింది పాణీపూరి.సాయంత్రం అయిందంటే చాలు పాణీపూరీ బండీల ద‌గ్గ‌ర జ‌నాలు ఎంత‌లా గుమిగూడుతారో చూస్తూనే ఉన్నాం.

అయితే పాణీపూరీలు మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఎలా వ‌డ్డిస్తారు ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టి కొన్ని ఉల్లిగ‌డ్డ‌లు వేసి ఇచ్చేస్తుంటారు.

స్ట్రీట్‌ ఫుడ్ లో విప‌రీత‌మైన డిమాండ్ ఉన్న‌టువంటి ఈ ఫుడ్ ఐట‌మ్ మీద ఆధార‌ప‌డి ఎంతోమంది జీవిస్తున్నారు.

మ‌రి అంద‌రిలా వ్యాపారం చేస్తే కిక్ ఏముంటుంది.పైగా వ్యాపారం న‌డ‌వాలంటే ఏదోఒక స్పెషాలిటీ ఉండాల‌ని ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి వెరైటీగా ఆలోచించాడు.

ఇంకేముంది వ‌చ్చిన ఆలోచ‌న‌ను వెంట‌నే అమ‌లు చేశాడు.అది కాస్తా వైర‌ల్ అయిపోయింది.

అదేంటంటే ఆయ‌న అర‌టి ఆకుల్లో పాణీపూరీల‌ను వ‌డ్డిస్తున్నాడు.దీనికి విప‌రీత‌మైన డిమాండ్ అయిపోయింది.

వాస్త‌వానికి అర‌టి ఆకులు అన్నం తినేందుకు ఉప‌యోగిస్తారు.

గతంలో సంప్రదాయంలో భాగంగా భోజ‌నం చేయాలంటే క‌చ్చితంగా అరటి ఆకుల్లోనే చేసే వారు క‌దా.కానీ రాను రాను అర‌టి ఆకులు పోయి ప్లాస్టిక్ ప్లేట్లు వ‌చ్చేశాయి.నిజానికి ఇలా అర‌టి ఆకుల్లో తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

వైద్య నిపుణులు కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతున్నారు.ఇప్పుడు ఢిల్లీలోని ఛాందినీ చౌక్‌లో ప్రాంతంలో ఓ వ్యాపారి ఇలా అర‌టి ఆకుల్లో పానీపూరి స‌ర్వ్ చేస్తుండ‌టంతో జ‌నాలు ఎగబ‌డి తింటున్నారు.

ఇక దీన్నంతా కూడా ఓ వ్య‌క్తి వీడియో తీసి వ‌ద‌లగా అది కాస్తా విప‌రీతంగా వైర‌ల్ అయిపోతోంది.మ‌రి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube