షాక్ కొట్టిన పిల్లాడిని కాపాడిన వ్యక్తి.. అతడు అలా చేయకపోయి ఉంటే!

మనలో చాలా మందికి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ ఎప్పుడో ఒకసారి కొట్టే ఉంటుంది.కానీ చిన్న షాక్ అయితే మనం కూడా పట్టించుకోము.

 The Person Who Rescued The Child Who Was Hit By The Current Shock If He Did Not-TeluguStop.com

అలా కాకుండా పెద్దగా కరెంట్ షాక్ కొడితే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.ఇలా చాలా మంది కరెంట్ షాక్ తో చనిపోయిన వారు ఉన్నారు.

షాక్ కొట్టేటప్పుడు ఆ వ్యక్తిని మనం ముట్టుకున్నా కూడా మనకు కూడా షాక్ వస్తుంది.

అందుకే షాక్ కొడుతున్న వ్యక్తిని మనం నేరుగా పట్టుకోము కర్ర సహాయంతో కానీ లేదంటే చెక్కతో కానీ పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తుంటారు.

అలా కాదని షాక్ తగిలినప్పుడు ఆ వ్యక్తిని నేరుగా తగిలితే మనం కూడా షాక్ కు గురి అవుతాం.అందుకే ఆ సమయంలో తెలివిని ఉపయోగించి అతడిని కాపాడాలి.

లేకపోతే వాళ్ళ ప్రాణం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

Telugu Child Scorched, Shock, Rajasthan, Personrescued-Latest News - Telugu

తాజాగా ఒక పిల్లాడు కరెంట్ షాక్ కు గురి అవ్వగా మరొక పిల్లాడు ఆ పిల్లాడిని కాపాడాడు.లేకపోతే కరెంట్ షాక్ తగిలి అతడు చనిపోయేవాడు.రాజస్థాన్ లోని చూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అదిల్ అనే ఆరు సంవత్సరాల పిల్లవాడు తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు.అదే సమయంలో ఆ పిల్లాడు రోడ్డు మీద ఉన్న కరెంట్ పోల్ ను పట్టుకున్నాడు.

ఆ పోల్ ను పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టింది.దీంతో వెంటనే ఆ పిల్లాడు కేకలు వేసి పక్కన ఉన్న వారందరిని పిలవడంతో ఆ పిల్లాడిని చెక్కతో పక్కకు నెట్టడంతో ఆ పిల్లాడు ప్రాణాలతో బయట పడ్డాడు.

అప్పటికే ఆ పిల్లాడి చెయ్యి కాలిపోయింది.ఆ పిల్లాడికి షాక్ కొట్టగానే ఆ వ్యక్త్తి అలా చెక్కతో పక్కకు నెట్టకపోయి ఉంటే ఇప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు.

అందుకే అతడిని అందరు ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube