టీడీపీ ఇచ్చే స్క్రిప్ట్ చదివే వ్యక్తి రఘురామకృష్ణంరాజు అంటున్న మంత్రి..!!

తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తి రఘురామకృష్ణం రాజు అని వైసీపీ మంత్రి తానేటి వనిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.హీరోయిజం చూపించడానికి ప్రజలను రెచ్చగొట్టడానికి విపరీతమైన భాష మీడియా ముందు  ఉపయోగించారని, ఉన్మాదిగా వ్యవహరించడాని రఘురామ కృష్ణం రాజు పై మండిపడ్డారు.

 The Person Who Reads The Script Given By Tdp Is Raghuram Krishna Raju The Minister Says-TeluguStop.com

ప్రజాప్రతినిధిగా వ్యవహరించకుండా ప్రజాసమస్యలను తెలుసుకోకుండా పరిధులు దాటి ఘోరంగా వ్యవహరించారని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.బండ బూతులతో వ్యంగ్యంగా కూడిన భాషతో.

మాట్లాడారని తెలిపారు.ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన ఒక్క లక్షణమైనా రఘురామకృష్ణంరాజుకి  లేదని దుయ్యబట్టారు.

 The Person Who Reads The Script Given By Tdp Is Raghuram Krishna Raju The Minister Says-టీడీపీ ఇచ్చే స్క్రిప్ట్ చదివే వ్యక్తి రఘురామకృష్ణంరాజు అంటున్న మంత్రి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రజల దగ్గర మన్ననలు పొందాలి అంటే వారి కష్టాలు తెలుసుకొని వారి సమస్యలు తీర్చాలని, అటువంటివారే ప్రజాప్రతినిధులుగా ప్రజాస్వామ్యంలో ఎదుగుతారని తెలిపారు.కానీ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని మీడియా ముందు.

వ్యంగ్యంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని తానేటి వనిత వ్యాఖ్యానించారు.ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా స్పందించారు.

కరోనా కష్టకాలంలో సీఎం జగన్ ప్రజల కోసం కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర చేస్తున్న రఘురామకృష్ణం రాజును శిక్షించాల్సిందే అని పేర్కొన్నారు.చంద్రబాబుకి తొత్తుగా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారని ఆరోపించారు.

మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో రఘురామ కృష్ణంరాజు మాట్లాడారని.రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తున్న ఈ కుట్రదారుని.

శిక్షించాల్సిందే.జైలుకు పంపాల్సిందే అని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  

#RaghuRama #Taneti Vanitha #Chandrababu #Jogi Ramesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు