కష్టకాలంలో సమంతను ఆదుకున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

నాగచైతన్యతో విడాకుల ప్రకటన ద్వారా ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువగా వార్తల్లో నిలిచారు.తెలుగులో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు.

 The Person Behind Supporting Samantha In Difficult Times , Samantha  , Tollywood-TeluguStop.com

జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా ఆ సమయంలో స్నేహితులు తోడుగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయి.సమంతకు సినిమా రంగానికి చెందిన వాళ్లలో కొంతమంది స్నేహితులు ఉన్నారు.

సమంత బెస్ట్ ఫ్రెండ్స్ లో శిల్పారెడ్డి కూడా ఒకరు కావడం గమనార్హం.

ప్రస్తుతం సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత బాధ పడుతున్న సమంత నా బెస్ట్ తో ఈ వారం గడిచిందంటూ శిల్పారెడ్డి గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.కొన్నిరోజుల క్రితం శిల్పారెడ్డితో కలిసి సమంత గోవా బీచ్ కు వెళ్లారనే సంగతి తెలిసిందే.

ప్రేక్షకులకు శిల్పారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ గా, న్యూట్రిషనిస్ట్ గా, ఫిట్ నెస్ నిపుణురాలిగా సుపరిచితం.

Telugu Friend, Bollywood, Difficult Times, Nutrionist, Samantha, Shilpa, Tollywo

శిల్పారెడ్డి సైతం అన్ని విషయాల్లో సమంతకు అండగా నిలబడుతున్నారని సమాచారం.సమంతకు విడాకుల ఒత్తిడి తగ్గడంలో శిల్పారెడ్డి తన వంతు సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది.అక్కినేని ఫ్యామిలీకి కూడా సమంత సన్నిహితురాలు కావడం గమనార్హం.

సమంత చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు ఉన్నాయి.ఆ సినిమాల ఫలితాలపైనే సమంత కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

Telugu Friend, Bollywood, Difficult Times, Nutrionist, Samantha, Shilpa, Tollywo

కథను, పాత్రను బట్టి సమంత పారితోషికం డిమాండ్ చేస్తారు కాబట్టి నిర్మాతలు సైతం ఆమెతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.సమంత త్వరలో బాలీవుడ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన సైతం చేయనున్నారని తెలుస్తోంది. సమంత పాత్రల ఎంపిక, కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రేక్షకులు మెచ్చే పాత్రలకు మాత్రమే ఓకే చెప్పాలని అనుకుంటున్నారు.  సమంత దసరా పండుగకు ప్రకటించిన రెండు సినిమాల షూటింగ్ త్వరలో మొదలు కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube