పవన్ కళ్యాణ్ స్టార్ కావడానికి కారణమైన మహిళ ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ తో, నటనతో యూత్ లో పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

 The Person Behind  Star Hero Pawan Kalyan Successful Career, Chiranjeevi Wife, S-TeluguStop.com

దాదాపుగా 25 సంవత్సరాలుగా నటుడిగా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ సినిమాల్లో, రాజకీయాల్లో పవన్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

పవన్ రాజకీయాల్లో సక్సెస్ సాధించడానికి ప్రయత్నాలు చేస్తుండగా 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.1971 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ అంజనా దేవి, కొణిదెల వెంకట్రావు దంపతులకు జన్మించారు.తండ్రి వృత్తిరిత్యా కానిస్టేబుల్ కావడంతో పవన్ కళ్యాణ్ వేర్వేరు స్కూళ్లలో చదవాల్సి వచ్చింది.

డిప్లొమా కంప్యూటర్ చదివిన పవన్ ఉన్నత చదువులు చదవడానికి ఆసక్తి చూపలేదు.

ఆ సమయంలో చిరంజీవి భార్య సురేఖ చిరంజీవితో పవన్ ను సినిమాల్లోకి తీసుకెళ్లాలని సూచనలు చేశారు.

Telugu Bheemla Nayak, Chiranjeevi, Brother, Pawan, Pawan Kalayn, Surekha, Ther P

అదే సమయంలో పవన్ కు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినా సురేఖ బలవంతంగా ఒప్పించారు.అలా చిరంజీవి భార్య సురేఖ శ్రమ వల్ల పవన్ కళ్యాణ్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.అయితే సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం పవన్ ఎన్నో శిక్షణలు తీసుకున్నారు.

Telugu Bheemla Nayak, Chiranjeevi, Brother, Pawan, Pawan Kalayn, Surekha, Ther P

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో 1996 సంవత్సరంలో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.హిట్ ఫ్లాపులకు అతీతంగా పవన్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.పవన్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుండగా వచ్చే ఏడాది కొన్ని నెలల గ్యాప్ లోనే ఆ మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube