26 యేళ్లుగా ప్రతి రోజు రాత్రి ఈ సిక్కు సోదరుడు చేసే పనికి ఎంత అభినందించినా తక్కువే..  

 • కోట్లు సంపాదించే వారు కనీసం వంద రూపాయలు సాయం చేసేందుకు కూడా ఆసక్తి చూపించరు. సాయం చేయడానికి డబ్బుతో పని లేదని, మంచి మనసు ఉంటే చాు అంటూ పాట్నాకు చెందిన గుర్మిత్‌ సింగ్‌ నిరూపించాడు. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టినా రాని పేరును ఈయన తన మంచి మనసుతో సాయం చేయడం వల్ల సంపాదించాడు. గత 26 ఏళ్లుగా గుర్మిత్‌ చేస్తున్న మంచి పనికి ఆయన్ను స్థానికులు ఎంతో మంది అభినందిస్తూ ఉంటారు. సుదీర్ఘ కాలంగా ఆయన చేస్తున్న సాయంతో ఎంతో మంది కడుపు నిండినది.

 • The Patna Man Gurmeet Singh Helping Food For Roadside Victims-Patna Viral About Gurmith Sing Viral In Social Media

  The Patna Man Gurmeet Singh Helping Food For Roadside Victims

 • పూర్తి వివరాల్లోకి వెళ్తే… పాట్నాకు చెందిన గుర్మిత్‌ సింగ్‌ చిన్న రెడిమెండ్‌ షాప్‌ ను రన్‌ చేస్తూ ఉంటాడు. 26 సంవత్సరాల క్రితం ఒక రోజు రాత్రి సమయంలో పాట్నా ప్రభుత్వ హాస్పిటల్‌ ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడట. అక్కడ తినడానికి తిండి లేని వారు ఎంతో మంది ఇబ్బంది పడుతూ కనిపించారు.

 • The Patna Man Gurmeet Singh Helping Food For Roadside Victims-Patna Viral About Gurmith Sing Viral In Social Media
 • ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో అనాధలుగా పడి ఉండి, వారికి సంబంధించిన వారు ఎవరు లేక పోవడంతో వారు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న గుర్మిత్‌ సింగ్‌ హాస్పిటల్‌లో అనాధ పేసెంట్స్‌ గా ఉన్న వారికి ప్రతి రోజు ఆహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

 • The Patna Man Gurmeet Singh Helping Food For Roadside Victims-Patna Viral About Gurmith Sing Viral In Social Media
 • గత 26 సంవత్సరాలుగా ప్రతి రోజు రాత్రి 9 గంటలకు గుర్మిత్‌ అక్కడకు చేరుకుంటాడు. అప్పటికే ఆయన కోసం ఆకలితో రోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆకలితో ఉన్న రోగుల వద్దకు తాను తీసుకు వెళ్లిన ఆహారపు పొట్లాలను పట్టుకు వెళ్లి ఇస్తాడు. వారు ఆ పొట్లాల్లో ఉన్న ఆహారం కడుపు నిండా తిని పుట్టెడు సంతోషంతో నిద్ర పోతారు.

 • The Patna Man Gurmeet Singh Helping Food For Roadside Victims-Patna Viral About Gurmith Sing Viral In Social Media
 • అడుకుంటే కాని కడుపు నింపుకోలేని వారు, ఏదైన పని చేస్తే తప్ప తిండి తొరకని వారు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో జాయిన్‌ అవుతారు. వారికి చికిత్స అయితే వైధ్యులు అందిస్తారు కాని, వారికి ఆహారం మాత్రం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు పాట్నా ప్రభుత్వ హాస్పిటల్‌ లో అనాధ రోగులకు గుర్మిత్‌ పెద్ద దిక్కు అయ్యి వారి ఆకలి తీర్చుతున్నాడు.

 • The Patna Man Gurmeet Singh Helping Food For Roadside Victims-Patna Viral About Gurmith Sing Viral In Social Media
 • రాత్రి సమయంలో కొన్ని హోటల్స్‌ వారు మిగిలి పోయిన ఆహారంను చెత్త కుప్పలో పడేస్తూ ఉంటారు. అవాంటి వారితో మాట్లాడి గుర్మిత్‌ ఆ ఆహారంను అనాధ రోగులకు ఇవ్వమని గుర్మిత్‌ కోరాడు. అందుకు వారు ఒప్పుకున్నారు. రాత్రి సమయంలో కొన్ని హోటల్స్‌ వద్ద తిరిగి ఫుడ్‌ కలెక్ట్‌ చేసి హాస్పిటల్‌కు తీసుకు వెళ్తాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 యేళ్లుగా ఇలాంటి దిన చర్యను కొనసాగిస్తున్న గుర్మిత్‌ సింగ్‌ను ఎంత పొగిడినా కూడా తక్కువే అవుతుంది. గుర్మిత్‌ సింగ్‌కు శిరస్సు వంచి నమష్కరించాల్సిందే.