బాషా సినిమాలో రజనీకాంత్ ఎంతో గ్యాంగ్‌స్టర్ చరిత్ర ఉన్న ఆటో కోరుతూ నార్మల్ లైఫ్ గడుపుతుంటాడు.అతడు ఒక ఆటో డ్రైవర్ అని మాత్రమే అందరూ అతన్ని తక్కువగా చూస్తూ ఉంటారు.
కానీ అతను చరిత్ర తెలిసి హడలిపోతుంటారు.రియల్ లైఫ్‌లో కూడా ఎంత గొప్ప గత జీవితం కలిగిన వారు అవన్నీ వదిలేసి ఆటోలు, టాక్సీలు తోలుతూ జీవితాన్ని గడుపుతున్నారు.
ఒక్కోసారి వీరి గురించి ప్యాసింజర్లు తెలుసుకొని అవాక్కవుతున్నారు.అలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది.
ఈ ఘటనలో ఒక ఆటో డ్రైవర్‌కి ఉన్న నాలెడ్జ్ తెలుసుకొని ఒక ప్యాసింజర్ షాక్ అయ్యాడు.
ఆ ప్యాసింజర్ పేరు రాజీవ్ కృష్ణ.
అతడు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు.ముంబైలో ఆటోలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యిందని.
కేవలం 3 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి గంటసేపు సమయం పట్టేటట్లు గూగుల్ మ్యాప్స్ చూపించిందని అతడు తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు.ఆటోలో వెళ్లడం కష్టమని నడిచి వెళ్లి పోదామని అతడు అనుకున్నాడట.
ఇంతలోనే ఆటో డ్రైవర్ తనతో మాట్లాడటం మొదలుపెట్టాడట.మొదటగా ఆ ఆటో డ్రైవర్ రాజీవ్‌తో మాట్లాడుతూ.‘ సార్, మీరు ఏయే దేశాలకు వెళ్లారు?’ అని అడిగాడట.
అయితే ఈ ఆటో డ్రైవర్‌కి ప్రపంచంలో ఉన్న ప్రదేశాల గురించి ఏం తెలుస్తుంది.
అసలు ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నట్లుగా రాజీవ్ విసుగ్గా ఫీల్ అయ్యాడట.తర్వాత తాను ప్రపంచంలో తిరిగిన ప్రదేశాల గురించి చెప్పాడు.అయితే ఆ ప్రదేశాలు ఏ దేశంలో, ఏ ఖండాల్లో ఉంటాయో ఆటో డ్రైవర్ తనకు తెలుసని చెబుతూ.యూరప్ ఖండంలోని మొత్తం 44 దేశాల పేర్లు టకటకా చెప్పేసాడు.
దాంతో ఆశ్చర్యపోవడం రాజీవ్ వంతైంది.

ఈ ఆటో డ్రైవర్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ ప్రాంతానికి చెందిన వాడు.చూసేందుకు చాలా సింపుల్ గా ఉన్న ఇతడికి ఉన్న నాలెడ్జ్ డిగ్రీ చదివే వారికి కూడా ఉండదని చెప్పొచ్చని రాజీవ్ తన పోస్టులో రాసుకొచ్చాడు.ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్ తన రాష్ట్రంలోని అన్ని జిల్లాల పేర్లు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నాడు.
అలానే దేశంలోని పలు ప్రాంతాలు ఎక్కడున్నాయో కూడా వెంటనే చెప్పాడని చూసి అతడు చరిత్ర ఏంటో రాజీవ్ కనుక్కున్నాడు.అప్పుడు అతను సెల్ఫ్ స్టడీ ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్నట్లు తెలిసింది.
అలాగే ఇతనికి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తో పాటు ఇంగ్లీష్ లో నంబర్స్ చెప్పడం కూడా తెలుస్తుందట.ఇంతకీ అతని పేరు ఏంటంటే రామ్‌దేవ్.అతని వయస్సు 61 ఏళ్లు.







