విమానం టాయిలెట్‌లో అతడు చేసిన పనికి అంతా టెన్షన్‌ పడ్డారు.. ప్రాణాలు గాల్లో కలిసినట్లే అనుకున్నారు, కాని..!

మనిషికి ఉండే కొన్ని అలవాట్లు ఎక్కడ ఉన్నామనే విషయాన్ని కూడా మర్చి పోయేలా చేస్తాయి.అలవాటు ప్రకారం ఆ పని చేయక పోతే మొత్తం ఏదో కోల్పోయిన వాడి మాదిరిగా అయిపోతారు.

 The Passenger Smoking In The Flight Makes Emergency In The Flight-TeluguStop.com

ముఖ్యంగా సిగరెట్‌ అలవాటు ఉన్న వ్యక్తి తాను రెగ్యులర్‌గా తాగే సమయానికి తాగకపోతే చాలా మిస్‌ అవుతాడు.అందుకే ఎక్కడ ఉన్నా, ఎంత మందిలో ఉన్నా కూడా తాను అనుకున్నట్లుగా సిగరెట్‌ తాగేందుకు సిద్దం అవుతాడు.

అలా ఒక వ్యక్తి విమానంలో సిగరెట్‌ తాగడంతో ప్రయాణికులు అంతా కూడా భయాందోళనకు గురయ్యారు.చివరకు పైలెట్‌ అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్‌ చేయడం జరిగింది.

 The Passenger Smoking In The Flight Makes Emergency In The Flight-విమానం టాయిలెట్‌లో అతడు చేసిన పనికి అంతా టెన్షన్‌ పడ్డారు.. ప్రాణాలు గాల్లో కలిసినట్లే అనుకున్నారు, కాని..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మన దేశంలోనే జరిగిన ఈ ఆశ్చర్యకర సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… గోవా నుండి ఢిల్లీకి ఇండిగో విమానం బయలుజేరింది.ఆ విమానంలో అందరు కూడా సాఫీగా ప్రయాణిస్తున్నారు.కొన్ని నిమిషాల్లోనే విమానం గమ్య స్థలంకు చేరుకోవాల్సి ఉంది.గోవా నుండి ఢిల్లీకి విమాన ప్రయాణం గంటలు గంటలు ఏమీ పట్టదు.అయినా కూడా విమానంలో ఉన్న ఒక వ్యక్తికి తిగరెట్‌ తాగాలని నాలుక గుంజిందట.కొన్ని నిమిషాలు ఆపుకోలేక తన వద్ద ఉన్న సిగరెట్లను తీసుకుని బాత్‌రూంలోకి దూరాడు.

బాత్‌ రూంలో సిగరెట్‌ తాగితే ఎవరు ఏమీ అనుకోరని ఆయన భావించాడు.

కామ్‌ గా బాత్‌ రూంలోకి వెళ్లి తాపీగా సిగరెట్‌ తాగడం మొదలు పెట్టాడు.ఆశ్చర్యకరంగా బాత్‌ రూం నుండి వస్తున్న పొగను చూసి విమాన సిబ్బంది అవాక్కయ్యారు.వెంటనే పైలెట్‌కు విషయాన్ని చెప్పడంతో ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ ఎయిర్‌ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చి వెంటనే ల్యాండింగ్‌కు క్లియరెన్స్‌ తీసుకున్నాడు.

అనుకున్న సమయం కంటే అయిదు పది నిమిషాల ముందే విమానం ల్యాండ్‌ అయ్యింది.

ఏదైనా ప్రమాదం జరిగిందని అంతా భావించారు.అయితే విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఆ పొగ సిగరెట్‌ పొగ అని తేలిపోయింది.దాంతో సదరు ప్యాసింజర్‌ పై ఇండిగో విమాన సంస్థ కేసు పెట్టింది.

పలు సెక్షన్స్‌ కింద అతడిపై కేసులు నమోదు అయ్యాయి.అతడు చేసిన పనికి విమానంలో ఉన్న ప్రయాణికులు అంతా కూడా కొన్ని నిమిషాల పాటు తమ ప్రాణాలు గాల్లో కలిసినట్లే అని భయపడ్డారు.

విమానం సేఫ్‌ గా ల్యాండ్‌ అయిన తర్వాత అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు