టి. కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు ? ఇంఛార్జి తో సహా.. ?

తెలంగాణ కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  ఇప్పటివరకు అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న పిసిసి అధ్యక్షుడి ఎంపిక తో పాటు  మిగిలిన విభాగాలలోనూ సమూల ప్రక్షాళన చేయాలని , లేకపోతే కాంగ్రెస్ ఎప్పటికీ తెలంగాణలో అధికారం సాధించలేదనే రిపోర్టులు పార్టీ హైకమాండ్ కు వెళ్లడంతో పీసీసీ అధ్యక్షుడి  నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 The Party Is Dominating The Idea Of Huge Changes In The Telangana Congress Posts-TeluguStop.com

వాస్తవంగా పిసిసి అధ్యక్ష పదవిని ఎప్పుడో భర్తీ చేయాల్సి ఉన్నా, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ భర్తీ చేపట్ట వద్దు అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు , నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో అధిష్టానం వెనకడుగు వేసింది.

సాగర్ ఎన్నికల తంతు ముగియడంతో , ఇక పిసిసి అధ్యక్షుడు ఎంపిక పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.

 The Party Is Dominating The Idea Of Huge Changes In The Telangana Congress Posts-టి. కాంగ్రెస్ లో భారీ భారీ మార్పులు ఇంఛార్జి తో సహా.. -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాకూర్ ఉన్నారు.కానీ ఆయన ప్రభావం దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ,  జిహెచ్ఎంసి ఎన్నికల్లో కానీ, పెద్దగా కనిపించలేదు.

అలాగే ఆయన మాట వినే వారు తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దగా లేకపోవడం లేదు.  ఇన్చార్జి ని  సైతం పట్టించుకున్నట్లు వ్యవహరించకపోవడం తో పార్టీ అధిష్టానానికి ఆయన నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

తననూ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని, ఆ స్థానంలో వేరొక నియమించాలి అంటూ,  అధిష్టానానికి చెప్పడంతో పిసిసి అధ్యక్షులు పదవితో పాటు, మిగిలిన అనుబంధ సంఘాల నియామకాల విషయంలో నూ సమూల ప్రక్షాళన చేయాలని,  పార్టీకి కలిసి వచ్చే వారితో ఈ పదవులను భర్తీ చేసి 2023 ఎన్నికలనాటికి కాంగ్రెస్ కు మరింత ఊపు తీసుకురావాలని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారట.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తంతు త్వరలోనే పూర్తి కాబోతున్న తరుణంలో, తెలంగాణపై దృష్టి పెట్టి పదవులను భర్తీ చేయాలని అధిష్టానం పెద్దలు డిసైడ్ అయ్యారట.కొత్త పదవుల కోసం అప్పుడే తెలంగాణ నేతలు అధిష్టానం వద్ద ఒత్తిడి పెంచే  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట.ఇది ఎన్ని వివాదాలకు దారితీస్తుందో, ఎన్ని గ్రూపు రాజకీయాలకు కారణం అవుతుందో.

#Janareddy #Manikyam Togore #Congress #Rahul Gandhi #T PCC President

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు