రోజరోజుకూ సోషల్ మీడియా పరిధి విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలకు ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతోంది.చాలా వరకు వైరల్ వీడియోలు బాగా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విచిత్రమైన ఘటనలు జరిగినా సరే వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంటాయి.అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఎక్కువగా జరుగుతోందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఏకంగా కోర్టుల వరకు ఈ విషయం వెళ్తోందంటే దీని ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు.కానీ చెడు ప్రభావం ఎంత ఉన్నా కూడా ఎంతో మందికి విజ్ఞానాన్ని పెంపొందించుతోంది సోషల్ మీడియా.
అదే సమయంలో సరదా సన్నివేశాలకు కూడా బ్రహ్మరథం పడుతోంది.విజ్ఞానానికే అందిస్తూనే మెసేజ్ కూడా ఇస్తోంది సోషల్ మీడియా.అయితే ఇందులో ప్రధానంగా వైరల్ వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి.ఎందుకంటే అవి ఏవీ స్క్రిప్టు రాసుకుని ఏ పనులు చేయవు కాబట్టి వాటి సహజత్వాన్ని ఆ వీడియోలో మనం చూడొచ్చు.అందుకే వీటికి ఎక్కువగా ఆదరణ ఉంటుంది.ఇప్పుడు కూడా ఓ వైరల్ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోతుంది.ఓ పిల్లిని ఓ చిలుక ఆటపట్టించిన తీరు మనం ఇందులో చూడొచ్చు.
ఈ వీడియోలో బాగా గమనిస్తే ఓ పిల్లి ఓ దగ్గర కూర్చుని తీక్షణంగా ఎటో చూస్తూ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.
కాగా ఈ సందర్భంలో అక్కడకు వచ్చిన ఓ చిలుక ఆ పిల్లిన గమనిస్తూ దాని వెనకాల ఉన్న తోకను నోటితో ఊపడాన్ని మనం చూడొచ్చు.ఆ తోకను చూస్తే దానికి ఏదో సరదాగా అనిపించినట్టుంది.దాన్ని పట్టుకుని ఇంకా గట్టిగా ఊపాలని ప్రయత్నించింది.అయితే చిలుకను గమనించిన పిల్లి వెనక్కు తిరిగే లోపే చిలుక జంప్ అయిపోయింది.
ఇదంతా అక్కడు ఉన్న కెమెరాల్లో రికార్డు కాగా ప్రస్తుతం విపరీతంగా వైరల్ అయిపోతుంది.