సాల‌రీ అడిగిన ఎంప్లాయ్‌కు షాక్ ఇచ్చిన ఓన‌ర్‌.. ఇది మామూలు ట్విస్టు కాదు..

ఏ ఆఫీసులో అయినా స‌రే కొన్ని నిబంధ‌న‌లు క‌చ్చితంగా ఉంటాయి.ఇక ఉద్యోగులు అంద‌రూ కూడా ఆ నిబంధ‌న‌లకు లోబ‌డి ప‌నిచేయాల్సి ఉంటుంది.

 The Owner Who Gave A Shock To The Employee Who Asked For The Salary .. This Is N-TeluguStop.com

ఇక అంద‌రూ కూడా జాబు చేసేది జీతం కోస‌మే.నెలాఖ‌రు వ‌చ్చిదంటే చాలు అంద‌రూ ఆతృత‌గా జీతం కోసం ఎదురు చూస్తుంటారు.

ఎప్పుడైతే సాలరీ తమ అకౌంట్‌లో ప‌డుతుందో అప్పుడే ఆ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది.ఎందుకంటే నెలంతా వారు ఆ జీతం కోస‌మే ప‌నిచేస్తారు.

ఇక ఇలా జీతం ప‌డ‌గానే అలా తాము ప‌డ్డ క‌ష్టాన్ని మ‌ర్చిపోతుంటారు.

కాగా అదే జీతాన్ని ఎవ్వ‌రైనా స‌రే అకౌంట్ల‌లో వేస్తారు.

లేదంటే మ‌రి కొంద‌రు మాత్రం చేతికి ఇస్తారు.ఇక చేతికి ఇచ్చేవి అంటే క‌చ్చితంగా నోట్ల‌లోనే ఉంటుంది.

కానీ ఐర్లాండ్‌లోని ఒక రెస్టారెంట్ య‌జ‌మాని త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే ఉద్యోగికి ఇచ్చిన జీతాన్ని చూస్తే మాత్రం ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ఇక ఆయ‌న ఇచ్చిన జీతానికి ఆ ఉద్యోగి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి.ఎందుకంటే రెస్టారెంట్ ఓన‌ర్ అత‌నికి జీతాన్ని నోట్ల రూపంలో కాకుండా లేదంటే అకౌంట్లో వేయ‌కుండా మొత్తం నాణేల రూపంలో అందించాడు.29.8 కిలోల బకెట్ లో 5 సెంట్ల నాణేలను మొత్తం జీతం కింద ఇచ్చాడు.

ఐర్లాండ్‌కు చెందిన సౌత్ విలియం స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న ఆల్ఫీస్ అనే వ్య‌క్తి స్థానికంగా ఉండే రెస్టారెంట్‌లో చాలా రోజులుగా ఉద్యోగం చేస్తున్నాడు.ఇక అత‌ను ఆ రెస్టారెంట్‌లో ప‌నిచేయ‌డం చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది.ఆ నెల‌నే అతడికి చివరి నెల కావ‌డంతో ఇక జీతం తీసుకుని వెళ్తాన‌ని చూస్తున్నాడు.

కానీ నాణేల రూపంలో ఇవ్వ‌డంతో షాక్ అయిపోయాడు.దీంతో అత‌నికి ఎదురైనా విచిత్ర పరిస్థితిని అత‌ను సోషల్ మీడిడియాలో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అవుతోంది.

త‌న‌కు జీతం కావాల‌ని అడిగితే ఆ య‌జ‌మాని ఇలా షాక్ ఇచ్చాడ‌ని అంతా కామెంట్లు పెడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube