నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?

"కుక్క మనిషికి మంచి స్నేహితుడు" అనే సామెత ఎంత నిజమో బెల్కా అనే కుక్క కథ నిరూపిస్తోంది.

తన యజమాని మరణించిన ప్రదేశం నుంచి కదలకుండా కూర్చున్న బెల్కా కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని కదిలించింది.

రష్యాలో(Russia) 59 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తి గడ్డకట్టిన ఉఫా నది ఒడ్డున సైకిల్ తొక్కేటప్పుడు ఈ విషాద సంఘటన జరిగింది.అనుకోకుండా మంచు విరిగిపోయి, ఆయన చల్లటి నీటిలో పడిపోయారు.

ఒక వ్యక్తి ఆయన్ని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ, నదిలోని బలమైన ప్రవాహం ఆయన్ని లాకెళ్లింది.అనేక రోజుల శోధన తర్వాత రక్షణ బృందాలు ఆయన శవాన్ని ఉఫా నదిలో(Ufa River) కింది భాగంలో కనుగొన్నారు.

బెల్కా డాగ్ (Belka Dog)మాత్రం ఆ ముసలాయన పడిపోయిన చోటు నుంచి కదల్లేదు అతను తిరిగి వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంది.నాలుగు రోజుల పాటు తన యజమాని తిరిగి వస్తాడనే ఆశతో నది ఒడ్డున కూర్చుంది.

Advertisement

యజమాని కుటుంబం దానిని ఇంటికి తీసుకెళ్లినా, బెల్కా మళ్లీ అదే చోటుకు వెళ్లేది.దాని ప్రవర్తన చాలామందిని ఎంతగానో కదిలించింది.

@brutamerica అనే ఇన్‌స్టాగ్రామ్(instagram) అకౌంట్‌లో బెల్కా కథను పంచుకున్నారు.ఆ పోస్ట్‌లో, "రష్యాకు చెందిన బెల్కా అనే కుక్క తన యజమాని మంచులో పడి మునిగిపోయిన చోట నాలుగు రోజులు వేచి ఉంది, అతను తిరిగి వస్తాడని ఆశతో" అని రాశారు.

ఈ పోస్ట్‌కు దాదాపు 14,000 లైక్‌లు వచ్చాయి, వేలాది మంది కామెంట్‌లలో తమ భావోద్వేగాలను వ్యక్తం చేశారు.ఒక యూజర్, "మనం వాటిని పొందెంత అర్హులం కాదు; అవి అన్ని విధాలా ఉన్నతమైనవి" అని రాశారు.

చాలామంది బెల్కాపై తమ ప్రేమను హార్ట్ ఎమోజీలతో పంచుకున్నారు.

ఒక్క లీటర్ కెమికల్స్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ.. వీడియో చూస్తే షాకే..
ఈ పాస్ కొనుగోలు చేస్తే.. క్రూయిజ్‌ షిప్స్‌లో ఏడాది పాటు ఫ్రీగా ప్రయాణించొచ్చు..?

ఈ కథ, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మరో సంఘటనను గుర్తు చేస్తుంది.ఒక కుక్క తన యజమాని గోదావరి నదిలో దూకి మరణించిన తర్వాత ఒక వంతెనపై తన యజమాని కోసం ఎదురు చూసింది.ఈ కథలు జపాన్‌కు చెందిన హచికో అనే కుక్క కథను గుర్తు చేస్తాయి.

Advertisement

హచికో తన యజమాని తిరిగి వస్తాడనే ఆశతో తొమ్మిది సంవత్సరాలు ఎదురు చూసిన కుక్క.ఇలాంటి కథలు కుక్కల అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి.

తాజా వార్తలు