సీసీ కెమెరాని గుర్తించిన గుడ్లగూబ.. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే..!

అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలో జరిగే పరిస్థితులను పరిశీలించడానికి చాలాచోట్ల రహస్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు.ఈ కెమెరాలను చూసి జంతువు అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాయి.

 The Owl That Found The Cctv Camera  If You Know What It Did Next Cc Cemera, Owl,-TeluguStop.com

కొన్ని ఇది ఏంటా అని తట్టి మరీ సీసీ కెమెరాని పరిశీలిస్తాయి.ఈ సీసీ కెమెరాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జంతువులు, పక్షులు తమ ఎదురుగా వస్తే ఆటోమేటిక్‌గా ఫొటోలు తీస్తాయి.

అలానే వీడియో కూడా రికార్డ్ చేస్తాయి.ఇలా రికార్డ్ అయిన దృశ్యాలు అద్భుతంగా అనిపిస్తాయి.

తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోలో మూడు గుడ్లగూబలు సీసీ కెమెరా ముందుకు వచ్చి ఏదో చేయబోయాయి.

ఈ మూడు కూడా స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఉన్నాయి.ఇంతలోనే ఓ గుడ్లగూబ సీసీ కెమెరాను గుర్తించింది.

అనంతరం అది సీసీ కెమెరాని ఒక జీవి అనుకుని భ్రమ పడింది.అనంతరం దాన్ని భయపెట్టేందుకు నేరుగా కెమెరా దగ్గరకు పరుగెత్తింది.

కెమెరా ముందు నిల్చున్న గుడ్లగూబ.ఇదేదో తేడాగా ఉందే అన్నట్లు ఆ కెమెరా చుట్టూ చాలా పరిశీలనగా చూసింది.ఆ తర్వాత కెమెరాని భయపడతాం అన్నట్లుగా అది తన కళ్లను పెద్దవి చేసి చాలా భయంకరంగా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది.తన తలను క్రిందికి, పైకి, గుండ్రంగా తిప్పుతూ కెమెరా ముందు ఒక షో చేసింది.

అంతేకాదు, ఈ గుడ్లగూబ రెక్కలు విప్పి మరీ తన కంటే పోటుగాడు ఇక్కడ ఎవరూ లేరన్నట్టుగా తెలిపింది.ఈ ఫన్నీ దృశ్యాలన్నీ కూడా కెమెరాలో క్లారిటీగా రికార్డు అయ్యాయి.

ఈ ఫన్నీ వీడియోని @Animal_WorId అనే ట్విట్టర్ అకౌంటు షేర్ చేయగా ఇప్పుడు అది అది వైరల్‌గా మారింది.కెమెరా ముందుకు వచ్చి గుడ్లగూబ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లను ఫిదా అవుతున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్యూట్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube