వైరల్ వీడియో: రోడ్డు మీద బిడ్డ‌ను కాపాడేందుకు బైక్ మీద నుంచి జంప్ చేసిన అస‌లైన హీరో..!  

the original hero who jumped off the bike to save a child on the road road, baby, mother, stroller, viral video - Telugu Baby, Mother, Road, Stroller, Viral Video

చిన్న పిల్లలను బయటకు తీసుకు వచ్చినప్పుడు వారిని ఎత్తుకొని ఎక్కువ దూరం నడవలేమన్న నేపథ్యంలో చాలామంది తల్లులు వారి పసిబిడ్డలను స్ట్రోల్లెర్ లో కూర్చోబెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటారు.పల్లెటూరు, చిన్న చిన్న పట్టణాల్లో ఇవి తక్కువగా కనబడుతున్నా పట్టణాల్లో ఎక్కువగా ఇలానే పిల్లలను కూర్చోబెట్టుకొని బయటికి తీసుకు వెళుతుంటారు.

TeluguStop.com - The Original Hero Who Jumped Off The Bike To Save A Child On The Road

ఇలా తీసుకుని వెళుతున్న సమయంలో వారి పట్ల కచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే, ఏ పొరపాటు జరిగిన పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది.

ఇలాంటి సంఘటనకు సంబంధించి ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - వైరల్ వీడియో: రోడ్డు మీద బిడ్డ‌ను కాపాడేందుకు బైక్ మీద నుంచి జంప్ చేసిన అస‌లైన హీరో..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఒక తల్లి తన బిడ్డను స్ట్రోల్లెర్ లో ఉంచి ముందుకు సాగుతోంది.అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ, అలా వెళ్తున్న సమయంలో తల్లి చేతిలో నుంచి స్ట్రోల్లెర్ జారిపోయింది.

జారి పోయిన సమయంలో రోడ్డు వాలుగా ఉండడంతో బిడ్డ ఆగకుండా రోడ్డు మీద అలాగే కిందికి జారి పోయింది.ఈ పరిణామంతో తల్లి కాపాడండి అంటూ ఆ బిడ్డ వెనకాల పరుగులు తీసింది.

ఇంతలో రోడ్డుపై ఓ మనిషి ఎదురుగా వస్తున్నాడు.రోడ్డుపై అడ్డంగా వెళ్తున్న స్ట్రోల్లెర్, అందులో ఉన్న బిడ్డను చూసి సడన్ బ్రేక్ వేసి బైక్ మీద నుంచి అమాంతం దూకి ఆ బిడ్డను పట్టుకున్నాడు.

వెనకాల పరిగెడుతున్న తల్లి వచ్చే సమయానికి ఆ బిడ్డను కింద పడిపోకుండా కాపాడి తన తల్లి చేతికి అందించాడు.అంత వేగంగా వెళ్తున్న ఆ వ్యక్తి బండిని అలాగే వదిలేసి బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసి విజయం సాధించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఫిల్మ్ మేకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Mother #Baby #Road #Stroller #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Original Hero Who Jumped Off The Bike To Save A Child On The Road Related Telugu News,Photos/Pics,Images..