గడిచిన 32 ఏళ్లుగా ఆ దీవిలో నివసిస్తున్న ఒకే ఒక్క వృద్ధుడు.. ఎందుకంటే..?!

ప్రస్తుతం మనం ప్రపంచంలో ఎలాంటి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఉదయం లేచినప్పుడు నుంచి ఏదో ఒక పని మీద పరుగులు పెడుతూనే జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం.

 The Only Old Man Living On The Island For The Past 32 Years Because, Old Man, Li-TeluguStop.com

నిమిషం తీరిక లేకుండా ఏదో ఒక పని మీద దృష్టి సారించి చివరికి బతకడానికి అవసరమైన తిండిని కూడా తినడం మానివేసి పనులలో మునిగి తేలుతున్నారు.మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి ఈ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన జీవితం కోసం వెళ్లి కొద్దిరోజులు గడుపుదామని ఆలోచిస్తూ ఉంటారు.

అందుకోసం చాలా మంది ప్రజలు వారికి ఇష్టమైన ప్రదేశాలను ఎన్నుకొని అక్కడికి వెళ్లి సేదతీరడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 32 సంవత్సరాలు ప్రకృతిని ఆస్వాదిస్తూ మధ్యధరా సముద్రం మధ్యలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

81 సంవత్సరాలు గల ఇటలీ రాబిన్ సన్ క్రూసో అని పిలువబడే ఓ వృద్ధుడు 1989లో దక్షిణ పసిఫిక్ సముద్రం వైపు వెళుతుండగా మార్గమధ్యలో ఆయన నావ చెడిపోవడంతో అతను దీవిలో ఆగిపోయాడు.అయితే అనుకోకుండా అతను అక్కడే ఉండడం మొదలు పెట్టేసాడు.అతను అక్కడి చేరుకున్న సమయానికి ఆ దీవిలో ఉన్న కేర్ టేకర్ గా పనిచేసే ఓ పెద్దాయన పదవి విరమణ పొందుతున్న నేపథ్యంలో ఆ తరువాతి బాధ్యతలను ఆ వృద్ధుడు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో తనకు ఉన్న ఓ పొడుగైన నావను అమ్మేసి ఆ దీవిలో జీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు.దీంతో అతడు గత 32 సంవత్సరాలుగా ఎన్నో అవస్థలు పడుతూ అక్కడ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.

ఆయన గత 32 సంవత్సరాలుగా ఆ దీవి లోనే ఉంటూ ఆ దివికి సంబంధించిన ప్రకృతి రమణీయతను కాపాడుతూ ముందుకు సాగుతున్నాడు.అయితే అతను ఒక్కడు ఆ దీవిలో నివసిస్తాడని 2016లో ప్రపంచానికి తెలిసింది.

అయితే ఆ దీవి ఆధీనంలో ఉన్న దేశం నుండి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అతనికి నోటీసులు వచ్చాయి.అయితే అతను వాటికి బెదిరి పోకుండా న్యాయపోరాటానికి దిగాడు.

న్యాయపోరాటంలో తనకు అనుకూలంగా చాలా మంది సపోర్ట్ చేశారు.కాకపోతే.

, ఆ న్యాయపోరాటంలో కోర్టు ఆ దీవి ప్రభుత్వానికి సంబంధించినదేనని తీర్పు ఇవ్వడంతో చేసేదిలేక చివరికి ఆ దీవిని వదలడానికి సిద్ధమయ్యాడు.అయితే కోర్టు ఇచ్చిన తీర్పుతో తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని.

తాను షాపింగ్ చేసి మళ్లీ సముద్రాన్ని చూస్తా.నేను నాలాగే జీవిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.

ఎంతైనా 32 సంవత్సరాలు ఒక దీవిలో అతను ఒక్కడు జీవించడం అంటే నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube