ఆన్లైన్ పేమెంట్ కార్డుపైన ఇకనుండి QRతో పాటు ఫోటో కూడా ఉండాలి?

డిజిటల్ ఇండియా అని మోడీ ఏరోజు నినాదం చేపట్టాడో గాని, నేడు ఇక్కడ లావాదేవీలన్నీ సుమారుగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి.జేబులో డబ్బులు పెట్టుకొని మార్కెట్లోకి వెళ్లి పదేపదే తడుముకొనే రోజులు పోయాయి.

 ఆన్లైన్ పేమెంట్ కార్డుపైన ఇక�-TeluguStop.com

ఎంత చిన్న మొత్తంలో కొనుగోలు చేసినా కూడా ఇపుడు ఆన్లైన్ పేమెంట్స్ చెయ్యడం పరిపాటు అయ్యింది.పెద్ద పెద్ద మాల్స్ నుండి వీధి చివరన ఉండే చాట్ బండి వరకు వ్యాపారం జరిగే ప్రతీ చోట ఈ QR కోడ్ అనేది తప్పనిసరిగా కనబడుతుంది.

ఇది చిటికెలో స్కాన్ చేసి, డిజిటల్ చెల్లింపులు చేయడానికి డిజిటైజేషన్ అందించిన ఓ అద్భుతమైన సౌలభ్యం.

అయితే సాధారణంగా ఈ QR కోడ్ పక్కన గాని, మీదనగాని మనకి ఎలాంటి ఫొటోస్ కనిపించవు.

అదేనండి, ఆ సంబంధిత ఓనర్ కి సంబంధించిన ఫొటోస్ అస్సలు కనిపించవు.అయితే ఇపుడు తాజా అప్డేట్ అనేది వచ్చింది.దానితో సదరు ఓనర్ ఫోటును కూడా మనం చూడవచ్చును.ఆ ఫోని బట్టి ఓనర్ కి సంబంధించిందా లేక మరెవ్వరికైనా సంబంధించిందా అనేది సులువుగా తెలుసుకోవచ్చు.

ఓనర్స్ కూడా ఈ అప్డేట్ వెంటనే తెలుసుకొని తమ ఫోటోలను QR కోడ్ పైన ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Telugu Qr, Qr Scan Copy, Ups-Latest News - Telugu

ఒకసారి ఫోటో QR సిద్ధం అయ్యాక, వ్యాపారి దానిని డౌన్లోడ్ చేసుకుని, కస్టమర్లకు డిజిటల్ వెర్షన్ షేర్ చేయవచ్చు.లేదంటే, తమ షాప్ల వద్ద పేమెంట్ల కోసం ఉంచబడిన కాపీకి రీప్లేస్ చేయొచ్చు.అయితే ఇపుడు మీ ఫోటో QR పొందే విధానం ఎలాగో తెలుసుకోండి.

1.ముందుగా Paytm యాప్ ఓపెన్ చేయాలి.

2.తరువాత హోమ్ పేజీలో కనిపించే ఫోటో QR ఐకాన్పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటోని ఎంచుకోవాలి.

3.ఇంకేముంది, మీరు ఎంచుకున్న ఫోటో QR సిద్ధం అయిపోయింది.దీని తర్వాత, చిరునామా యాడ్ చేయాలి.

4.చివరగా మీ ఫోటో QRను ఆర్డర్ చేయడానికి కావలసిన చెల్లింపు చేసి, అది మీ వద్దకు చేరుకునే వరకు పెటియం యాప్లో స్టేటస్ ట్రాక్ చేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube