జనసేనకి ప్రవాహానికి గండి కొడుతున్న...'ఆ ఒక్కడు'..?  

The One Man Controlling Entire Janasena Party-

ఏపీలో 2014 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ తన తెలుగుదేశం పార్టీకే అధికారం కట్టబెట్టే స్థాయికి వెళ్ళారు.పవన్ ఎంట్రీ తో ఒక్క సారిగా అప్పటి రాజకీయ పరిస్థితులు తల్లకిందులయ్యాయి.కొత్త రాష్ట్రంలో సీఎం గా వైసీపీ జెండా ఎగురుతుందని భావించిన వారి అంచనాలు అన్నీ పవన్ దెబ్బకి ఫటాపంచలు అయ్యాయి.అయితే ప్రజా రంజకంగా ప్రభుత్వాని పాలిస్తానని మాటిచ్చి పవన్ మద్దతు తీసుకున్న బాబు ఆ మాట తప్పటంతో జనసేనాని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పై దండయాత్ర చేయడానికి సిద్దమయ్యారు.ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కి కాలుడువ్వుతూనే మరో పక్క తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేస్తానని శపధం చేశారు.ఈ క్రమంలోనే.

జనసేనకి ప్రవాహానికి గండి కొడుతున్న...'ఆ ఒక్కడు'..?-The One Man Controlling Entire Janasena Party

పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రని ఏపీలో ఉత్తరాంధ్ర పర్యటన ద్వారా మొదలు పెట్టి చంద్రబాబు నిరంకుశత్వాన్ని ఎండగడుతున్నారు.ఉభయగోదావరి జిల్లాలో ప్రస్తుతం పర్యటనలు చేస్తూ ఎన్నికలు వచ్చేలోగా కనీసం నాలుగు జిల్లాలలో అయినా సరే పార్టీకి మాంచి మైలేజ్ రావాలని అహర్నిశలు కష్టపడుతున్నారు.అందుకు తగ్గట్టుగానే గత ఎన్నికల్లో పవన్ మద్దతుతో పశ్చిమలో 15 సీట్లకి గాను 15 సీట్లు అందించిన పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ అవినీతిలపై నిలదీస్తున్నారు.చింతమనేని ఆగడాలని ప్రతీ పర్యటనలో ఖండిస్తున్నారు కూడా చింతమనేని చేసే దౌర్జన్యాల చిట్టాని ప్రతీ మీటింగ్ లో ప్రస్తావిస్తూ చంద్రబాబు పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు.

అయితే ఇక్కడి వరకూ జనసేన పార్టీ మైలేజ్ ప్రవాహంలా దూసుకుపోతోంది కానీ ఈ ప్రవాహానికి అంతర్గతంగా ఓ పెద్దమనిషి గండి కొడుతున్నాడు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సొంత గూటిలో సెగలు పుట్టిస్తున్నాడు.సదరు వ్యక్తి వ్యవహారంతో పార్టీలో కొంతమంది ముఖ్యనేతలు..

తాజాగా పార్టీలోకి వస్తున్న నేతలు.అభిమానులు ఇలా ఒకరేమిటి చాలా మంది సదరు వ్యక్తి వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. పార్టీలో పవన్ కళ్యాణ్ కంటే కూడా పై స్థాయి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ని నడిపించే శక్తిగా ఆయన వ్యవహారం ఉంటోందని పార్టీలో కొందరు కీలక నేతలే చెవులు కొరుక్కుంటున్నారని తెలుస్తోంది.ఇంతకీ ఆయన ఎవరో కాదు

జ‌న‌సేన మీడియా కోఆర్డినేట‌ర్ గా ఉన్న హ‌రిప్ర‌సాద్. ఆయన తీరుతో ఇప్పటికే ఎంతో మంది పార్టీలో కీలక నేతలు పవన్ పై అపారమైన ప్రేమాభిమానాలు ఉన్న కొంతమంది నేతలు దూరంగా ఉంటున్నారట. సుంక‌ర దిలీప్ వంటి బ‌ల‌మైన నేత‌లు ఒకానొక సమయంలో పార్టీ దూరం పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎలా ఉందొ తెలుసుకోవచ్చు.

అంతేకాదు ఎన్నో సమస్యలని పవన్ దృష్టికి తీసుకువెళ్ళమని హరి ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్తే అవి పవన్ వరకూ వెళ్ళేవి కాదట దాంతో ఈ విషయం తెలియక చాలా మంది పవన్ కళ్యాణ్ మన భాధలు పట్టించుకోవడం లేదని పవన్ కిదూరం అయ్యారట ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి..

అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు పవన్ పార్టీలో హరిప్రసాద్ తీరుకి అడ్డం పడుతోంది. ఇటీవ‌ల హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ప్ర‌తినిధి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ కోసం ప్ర‌య‌త్నం చేశారు.

కానీ అవి నెర‌వేర‌లేదు. అందుకు మీడియా హెడ్ గా ఉన్న హ‌రిప్ర‌సాద్ తీరే కార‌ణ‌మ‌ని ప‌లువురి అభిప్రాయం.దాంతో ప్రజారాజ్యం లో చిరంజీవికి వెన్నుపోటు పొడిచిన పరకాల ప్రభాకర్ తీరుగా హ‌రిప్ర‌సాద్ తీరుకూడా ఉంటోందని సోషల్ మీడియాలో సైతం పోస్టులు కోకొల్లలుగా వస్తున్నాయి.హ‌రిప్ర‌సాద్ వైఖ‌రి మీద ఇప్ప‌టికే మీడియా ప్ర‌తినిధులు మండిప‌డుతున్నారు. త‌గిన రీతిలో స్పందించ‌క‌పోవ‌డ‌మే కాకుండా, అస‌లు మీడియాలో అనేక మందిని ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంతో ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి చాలామంది దూరమయ్యే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే అబిప్రాయం ఉంది.

ఇదిలాఉంటే చిరంజీవికి అత్యంత ఆప్తుడుగా, చిన్ననాటి స్నేహితుడిగా ఉన్న ఒక కీలక వ్యక్తికి సైతం హరిప్రసాద్ వలన చిక్కులు వచ్చి పడుతున్నాయ.ఏకంగా చిరంజీవి స్నేహితుడే జనసేనలో హరిప్రసాద్ ఆగడాలని తెరపైకి తీసుకువచ్చారు సోషల్ మీడియా సాక్షిగా కడిగి పారేశారు.హ‌రిప్ర‌సాద్ వైఖ‌రి మార్చుకోవాల‌ని సూచించారు.అయితే

జనసేనలో నీ తీరు బాగోలేదని “ప్రశ్నించి” నందుకు హరి ప్రసాద్ చిరంజీవి స్నేహితుడిపైనే అసత్య కధనాలు రాయించారు అంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో దర్సనమిచ్చాయి..

పార్టీలో పవన్ కోటరీలో కీలక వ్యక్తిగా ఉంటూ పవన్ ఆశయాల తూట్లు పొడిచేలా ఉన్న హరిప్రసాద్ వైఖరిపై సర్వాత్రా నిరసనలు రేగుతున్నాయి.

స‌మన్వ‌య‌క‌ర్తగా సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి, ఎదురుదాడితో అంద‌రి నోళ్లూ నొక్కే యాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌డం అత్యంత దారుణమని ప్రశ్నిస్తే బదులు చెప్పాలిసింది పోయి నోళ్ళు నోక్కేస్తారా అంటూ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది.అయితే ఈ విషయంపై హరి ప్రసాద్ వలన ఇబ్బందులు పడిన అనేకమంది చిరంజీవి సన్నిహితుడు అయిన సత్యప్రసాద్ కి తమ గోడు వెళ్లగక్కుకున్నారని.హరి ప్రసాద్ ఆగడాలని ఒక్కొక్కటిగా చెప్పుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ హరి ప్రసాద్ ని కంట్రో చేయలేకపోతే పార్టీకి మరింత మంది కీలక వ్యక్తులు దూరం అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు అభిమానులు, నేతలు.