ఆ దేశంలో పాత టైర్లే ఇప్పుడు బంగారం..!

నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్ల కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉండడంతో నల్ల బంగారంలా మారిపోయాయి.నైజీరియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఇఫిడే లాపో రాన్సేవే అనే మహిళా ప్రిటెన్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే రీసైక్లింగ్ కంపెనీ స్థాపించింది.

 The Old Tire In That Country Is Now Gold  Old Tyres, Latest News, Gold,   Viral-TeluguStop.com

రెండేళ్ల కిందట కేవలం ఇద్దరు వ్యక్తులతో చిన్న షెడ్డులో మొదలైన ఈ కంపెనీ ఇప్పడు కాసుల వర్షం కురిపిస్తుంది.ఇందులో భాగంగా రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, డ్రైనేజి కాలువల్లో, పడి ఉన్న పాత టైర్లను వారు సేకరించి తమ రీసైక్లింగ్ ప్లాంట్ కి తీస్కొచేవారు.

ఆ తరువాత వాటిని ప్రత్యేక పద్దతిలో కరిగించి పేవ్ మెంట్ బ్రిక్స్ గా తయారు చేశారు.

ఇలా తయారు చేసిన పేవ్ మెంట్ బ్రిక్స్ ను క్వాలిటీ రోడ్లు, పార్కులు, పాఠశాల ఆవరణల్లోకి వేసేందుకు వీటిని ఉపయోగిస్తారు.

అక్కడి ప్రజలు కూడా వీటిని వాడేందుకు ఆసక్తి చూపడంతో ఒక్కసారిగా ఆమె కంపెనీ ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి.పాత మెషినరీ స్థానంలో కొత్త మెషినరీ ఏర్పాటు చేసినప్పటికీ డిమాండ్ కు తగ్గ స్థాయిలో బ్రిక్స్ ను అందివ్వలేని పరిస్థితి నెలకొంది అంటే దీని కున్న క్రేజ్ ను మనం అర్థం చేసుకోవచ్చు.

నలుగురితో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 128 మందికి చేరుకుంది.

Telugu Gold, Lapo Ranceway, Latest, Nigeria-Latest News - Telugu

ఇఫిడే లాపో రాన్సేవే ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్లాంటుకు పాత టైర్లు వెల్లువలా వచ్చి పడుతుండడంతో నల్ల టైర్లకు భారీగా డిమాండ్ పెరిగి పొయింది.దీంతో అక్కడ పాత టైర్లు నల్ల బంగారంలా మారిపోయాయి.ఒక్కో టైరుకు 0.20 డాలర్లు అంటే భారతీయ కరెన్సీ లో సుమారు రూ.15 చెల్లిస్తున్నారన్న మాట.కరోనా ఉపాధి కరువైన వారంతా ఈ పాత టైర్ల వేటలో పడ్డారు.ఎక్కడ కనిపించినా వాటిని పోగేసి మరి ఈ ప్లాంటుకు తీసుకురావడం విశేషం.

అయితే ఈ కంపెనీ ఇంత సక్సెస్ కావడంతో ఇఫిడే లాపో రాన్సేవే విజయ గాధను రాయిటర్స్ ప్రత్యేక కథనం ప్రచురిస్తూ పాత టైర్లను బ్లాక్ గోల్డ్ అంటూ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube