లక్షల్లో ఉచిత విమాన టికెట్ల ఆఫర్... వివరాలివే!

కరోనా తరువాత పలు దేశాలు వివిధ రంగాలలో తీవ్రమైన గడ్డుకాలాన్ని చవిచూశాయి.మరెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.

 The Offer Of Free Flight Tickets In Lakhs... The Details! Free Tickets, Flight T-TeluguStop.com

మరీ ముఖ్యంగా పర్యాటక రంగంపైనే పూర్తిగా ఆధారపడిన హాంకాంగ్ పరిస్థితి అయితే చాలా అద్వాన్నంగా తయారైంది.దీంతో ఆ దేశం ఓ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఇప్పటికే కుదేలయిన పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు విదేశీ పర్యాటకులను ఆకర్శించే విధంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.అవును, ఈ మేరకు దాదాపు 5లక్షల ఫ్లైట్ టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Telugu Tickets, Hong Kong, Travel, Travel Offers-Latest News - Telugu

పర్యాటక ప్రచార కార్యక్రమం ‘హలో హాంకాంగ్’ ప్రారంభించిన నేపథ్యంలో 5 లక్షల ఫ్లైట్ టికెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.ఈమేరకు హాంకాంగ్ విమానయాన సంస్థలు ఈ గురువారం ఓ ప్రకటన విడుదల చేసి పర్యాటకులకు శుభవార్తను తెలియజేశాయి.ఈ పథకంలో భాగంగా తమ దేశాన్ని సందర్శించాలనుకున్న పర్యాటకులకు వన్ ప్లస్ వన్ పద్ధతిలో టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అలాగే లక్కీ డ్రా విధానంలో కూడా ఈ ఉచిత టికెట్లను గెలుచుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Telugu Tickets, Hong Kong, Travel, Travel Offers-Latest News - Telugu

మార్చి నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఈ ఉచిత టికెట్ల పంపిణీ జరుగుతుందని ఈ సందర్భంగా చెబుతున్నారు.టికెట్లతో పాటు పలు కూపన్లు, క్యాష్ వోచర్లను గెలుచుకునే అవకాశంకూడా కల్పిస్తున్నారు.కాగా ఉచిత విమాన టికెట్ల కోసం హాంకాంగ్ ఎయిర్ లైన్స్ సంస్థలు ఏకంగా 2 బిలియన్ హాంకాంగ్ డాలర్లు (మన కరెన్సీలో రూ.2,100 కోట్లు) ఖర్చు చేస్తున్నట్టు భోగట్టా.భారతీయులకు కూడా ఉచిత టికెట్ల ఆఫర్ వర్తిస్తుందని, మార్చిలో ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియా పౌరులకు టికెట్లు కేటాయిస్తామని హాంకాంగ్ విమానయాన సంస్థల ప్రతినిధి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube