అక్కడ నర్సులు డాక్టర్లకంటే మిన్నగా పనిచేస్తున్నారు.. దెబ్బకి కోమాలో వున్న మనిషి లేచాడంతే!

శంకర్ దాదా MBBS సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు మందులే కాదు ప్రకృతి వైద్యంలో భాగమైన మనిషి పైన ఓ సగటు మనిషి చూపించిన ప్రేమకుడా మంచిగా పనిచేస్తుందని నిరూపించారు అక్కడి నర్సులు.అవును… మీరు వింటున్నది నిజమే.ఆ ఆసుపత్రిలో పేషెంట్ లో కదలికలు తీసుకవచ్చేందుకు సినిమా పాటలు వేసి డ్యాన్సులు చేస్తూ మరీ రోగుల్లో మానసిక స్థిరత్వం కల్పించడంతో పాటు శరీరంలో కదలికలను వచ్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం.కోమాలో ఉన్న ఓ వ్యక్తికి తమ డాన్సులతో వారు ప్రాణం పోశారు.

 The Nurses There Are Working Better Than The Doctors , Nurses , Docters , Socia-TeluguStop.com

అసలు విషయంలోకి వెళితే, కరీంనగర్ లోని మీనాక్షి హస్పిటల్ లోని నర్సులు వినూత్నంగా డ్యాన్సులు చేస్తూ పేషెంట్ నుండి స్పందన వచ్చేందుకు ప్రయత్నించారు.అయితే వారి శ్రమ వుట్టిపోలేదు.

అంత కోమాలో వున్న పేషేంట్ లో కూడా చలనం రావడం గొప్ప విషయం.ఇక పేషేంట్ వివరాలు చుస్తే, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్ అనే అతను లివర్ సంబంధిత వ్యాధితో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు.

పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అతన్ని 25 రోజుల క్రితం మీనాక్షి సూపర్ స్పెషాలిటీలో చేర్పించారు.

Telugu Docters, Karimnagar, Koma, Meenakshi, Chiranjeevi, Nurses, Srinivas-Lates

ఇక అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ కు చికిత్స అందించడంతో ఆరోగ్యం కుదుటపడుతోంది.ఈ క్రమంలో కళ్లు, కాళ్లు, చేతుల్లో కూడా కదలికలు రావాలన్న లక్ష్యంతో నర్సులు సినిమా పాటలు వినిపించి, డాన్సులు చేసి మరీ అతగాడిలో చలనం వచ్చేలా చేసారు.దీంతో సంగీతంతో రాళ్లైన కరుగుతాయన్న నానుడి రుజువైంది.

ఇక నర్సుల ఆటపాటలతో ఆ పేషేంట్ శరీరంలో కాస్త కదలికలు రావడంతో ఐసీయూ నుండి జనరల్ వార్డుకు తరలించి సహజసిద్దమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, రాజకీయ ప్రముఖులు వారిని విపరీతంగా మెచ్చుకుంటున్నారు.

ఇలాంటివారు ఎంతమందికో ఆదర్శనీయం అని కొనియాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube