‘నోటా’కు కష్టాల మీద కష్టాలు.. విజయ్‌ దేవరకొండ తల్లికి అనారోగ్యం!     2018-09-21   11:39:03  IST  Ramesh P

‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘నోటా’. తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందిన ఈ చిత్రంకు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రంను అక్టోబర్‌ 4న విడుదల చేయాలని భావించారు. అయితే ఆ వెంటనే వారం రోజుల్లో ఎన్టీఆర్‌ అరవింద సమేత చిత్రం విడుదల కాబోతుంది. ఆ కారణంగా నోటాకు కలెక్షన్స్‌ దెబ్బ పడే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా కొత్త విడుదల తేదీ గురించిన చర్చ జరుగుతుంది.

‘నోటా’ చిత్రాన్ని వచ్చే నెల 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. కాని అదే తేదీలో పెద్ద సినిమాలు తెలుగు మరియు తమిళంలో విడుదల కాబోతున్నాయి. అందువల్ల ‘నోటా’కు థియేటర్లు దక్కే పరిస్థితి లేదు. ఏదోలా అక్టోబర్‌ 4నే విడుదల చేయాలని భావిస్తే ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ తల్లి అనారోగ్యంగా ఉన్న కారణంగా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొనలేని పరిస్థితి. దాంతో సినిమా విడుదల తేదీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

‘నోటా’ చిత్రంను తెలుగులో డైరెక్ట్‌గా జ్ఞానవేల్‌ రాజా విడుదల చేయాలని భావిస్తున్నాడు. కాని ఆయనకు తెలుగు సినిమా పరిశ్రమపై, తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లపై పట్టు లేదు. ఆ కారణంగానే సినిమాను మరో భాగస్వామితో కలిసి విడుదల చేయాలని భావిస్తున్నాడు. దిల్‌రాజు, అల్లు అరవింద్‌తో పాటు యూవీ క్రియేషన్స్‌ వారితో చర్చు జరపడం జరిగిందట. కాని అక్టోబర్‌ 4 లేదా 18న విడుదల చేస్తే మాత్రం తాము సహకరించలేం అంటూ చేతులు ఎత్తేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నోటా చిత్రం విడుదల విషయంలో విజయ్‌ దేవరకొండ చాలా టెన్షన్‌లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. నవంబర్‌లో ఈ చిత్రం విడుదల చేస్తారనే టాక్‌ కూడా వినిపిస్తుంది. అతి త్వరలోనే ఫుల్‌ క్లారిటీ రానుంది.