ఓరి దేవుడో: కంట్లో ఎంత పెద్ద బతికి ఉన్న పురుగో..!

వృద్ధురాలి కంటిలో నుంచి 9 సెంటిమీటర్ల పొడవుతో బతికి ఉన్న కీటకాన్ని వైద్యులు బయటకు తీశారు.ఈ ఘటన కర్ణాటక ఉడుపిలో జరిగింది.

 Nine Centimeters Long Alive Insect Found In 70 Years Old Woman Eye In Karnataka-TeluguStop.com

కంటినొప్పితో బాధపడుతున్న ఓ 70 ఏళ్ల వృద్ధురాలు జూన్​ 1న చికిత్స కోసం ఉడుపిలోని ప్రసాద్​ నేత్రాలయకు వెళ్లింది.పరీక్షించిన వైద్యులు ఆమె కంటిలో సజీవంగా ఉన్న ఓ కీటకం ఉన్నట్లు గుర్తించారు.

కీటకం కదలికలను కట్టడి చేసేలా ఔషధాన్ని అందించి ఆమెను ఇంటికి పంపించారు.కానీ, తీవ్రమైన కంటినొప్పి, మంట వేధించగా.

సోమవారం మళ్లీ ఆమె ఆస్పత్రికి చేరుకున్నారు.దాంతో వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు.

కంటిలోపలి పొర నుంచి కీటకాన్ని బయటకు తీసి.వైద్యులే ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ పురుగుపై మరిన్ని పరిశోధనల కోసం లేబొరేటరీకి పంపించారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ కంట్లో నుంచి వెలికి తీశారు.దిలాజియా గులోసా అనే 14 పురుగులను వైద్యులు ఓరెగాన్‌కు చెందిన ఓ మహిళ (26) కళ్లలో గుర్తించి వాటిని వెలికి తీశారు.

Telugu Eye, America, Bats, Canada, Insect, Karnataka, Centimeterslong, Udipi, La

ఒక్కోటి అర అంగుళం పొడవుండే ఈ పురుగులు ఈగలు గబ్బిలాల ద్వారా సంక్రమిస్తాయని తెలుసునని వైద్యులు తెలిపారు.సాధారణంగా పరాన్న జీవి అయిన నెమటోడ్ అనే పురుగు కంట్లో నివాసం ఏర్ప‌రుచుకోవ‌చ్చు.సాధారణంగా నులి పురుగులు సన్నగా పొడవుగా ఉంటాయి.బయటకు చూడటానికి తెల్లగా కనిపిస్తాయి.కంట్లో ఈ నులి పురుగులు చాలా పొడవు పెరుగుతాయి.ఎంత అంటే ఒక కేసులో డాక్టర్లు 20 సెం.మీ పొడ‌వైన పురుగును బ‌య‌ట‌కు తీశారు.ఈ పరాన్నజీవి సంక్రమిస్తే.

కంటి పురుగు సోకిందని పిలుస్తారు.ఇలాంటి ఘటనలు జరగడం ఇప్పుడు సాధారణమైపోయింది.

ఎక్కడో ఓ చోట పరాన్న జీవులు కంట్లో బతికి ఉండే ఘటనలు కలకలం రేపుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube