యూట్యూబ్ లో ఆదాయాన్ని పెంచే సరికొత్త ఫీచర్..?!

మీరు యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారా.అయితే మీకో శుభవార్త.

 The Newest Feature To Increase Revenue On Youtube-TeluguStop.com

అది ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్ల కోసం ఒక అద్భుతమైన మనీ ఎర్నింగ్ ఫీచర్ ను యూట్యూబ్ సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మరింత సంపాదించుకోవచ్చు తెలుసా.

అది ఎలా అంటే.

 The Newest Feature To Increase Revenue On Youtube-యూట్యూబ్ లో ఆదాయాన్ని పెంచే సరికొత్త ఫీచర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూట్యూబ్ లో సూపర్ థ్యాంక్స్ అనే సరికొత్త ఫీచర్ రానుంది.

ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు వీడియోస్ చేస్తూ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు.మీ అందరికి 2017లో యూట్యూబ్‌ లో వచ్చిన సూపర్ చాట్ ఫీచర్ గురించి తెలిసే ఉంటుంది.

అప్పట్లో చాట్ ఫీచర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే దాని తరువాత మళ్ళి 2019లో సూపర్ స్టిక్కర్స్ పేరిట మరొక ఫీచర్ ను ప్రవేశపెట్టారు.

మళ్ళీ ఇప్పుడు సూపర్ థాంక్స్ ఫీచర్ ను ప్రవేశ పెట్టారు.అప్పట్లో వచ్చిన సూపర్ చాట్ ఫీచర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Telugu Income Increase, New Features, News Viral, Viral Latest, Youtube, Youtube Creater-Latest News - Telugu

ఇప్పుడు మళ్ళీ సూపర్ థాంక్స్ ఫీచర్ సహాయంతో యూట్యూబ్ క్రియేటర్లు మరింత ఆదాయం పొందవచ్చట.ఈ ఫీచర్‌ ను ప్రస్తుతం బీటా దశలో టెస్ట్ చేయడం వలన కేవలం బీటా క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలోనే యూట్యూబ్ క్రియేటర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందట.ఒకసారి ఈ ఫీచర్ గురించి తెలుసుకుందాం.

Telugu Income Increase, New Features, News Viral, Viral Latest, Youtube, Youtube Creater-Latest News - Telugu

సూపర్ థ్యాంక్స్ ఫీచర్ ద్వారా డబ్బును ఎవరయినా గాని డొనేట్ చేయవచ్చు.5 డాలర్లు మొదలుకొని 50 డాలర్ల వరకు క్రియేటర్లకు వ్యూయర్స్ డబ్బులు డొనేట్ చేయవచ్చట.ప్రస్తుతం ఈ ఫీచర్ 68 దేశాల్లోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ లభిస్తోంది.అంతేకాకుండా సూపర్ థ్యాంక్స్ ను ఎవరయితే కొనుగోలు చేస్తారో వారికి ప్రత్యేకమైన యానిమేటెడ్ జిఫ్ తో పాటు ప్రత్యేక బోనస్‌ ఉంటుంది.

అలాగే కామెంట్లలో గుర్తింపు కూడా లభిస్తాయి.మరి ఈసారి కొత్త ఫీచర్ యూజర్లకు ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

#New Features #Income Increase #YouTube Creater #Youtube

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు