ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ తరుణంలో ఏ విషయం గురించి ఐనా సరే, అలాగే ఎప్పుడైనా పిల్లలు మారం చేస్తే, లేదా సరిగ్గా తినకపోతే ఇప్పుడు కాలంలో తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చి కూడా వారి కడుపు నింపేలాగా చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
అలాగే చిన్న పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడటం, యూట్యూబ్ లో వివిధ రకాల వీడియోస్ చూస్తూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.కొన్ని సందర్భాలలో పిల్లలు ఎలాంటి వీడియోస్ వీక్షిస్తున్నారో అన్న సందేహం తల్లిదండ్రులలో తలెత్తవచ్చు.
దీంతో ఎప్పటికప్పుడు పిల్లలని చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుత పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ పై ఇష్టంతో స్కూలుకు కూడా వెళ్లనని మారాం చేస్తూ ఉంటారు.
దీనితో ఎక్కువగా యూట్యూబ్ లో గంటలకొద్ది చిన్నపిల్లలు సమయాన్ని కేటాయిస్తున్నారు.ఈ సమస్యకు చెక్ పెట్టడానికి తాజాగా యూట్యూబ్ సరికొత్త అప్డేట్ ను ప్రవేశపెట్టింది.
ఆ అప్డేట్ ఏమిటంటే.
యూట్యూబ్ చిన్న పిల్లలు చూసే కంటెంట్ ను కంట్రోల్ చేయడం కొరకు యూట్యూబ్ కిడ్స్ అనే ఫీచర్ ను ప్రవేశ పెట్టబోతుంది.
ఈ ఫీచర్ వినియోగించి చిన్న పిల్లలు చూసే కంటెంట్ ను ఫిల్టర్ చాలా సులువుగా చేసుకోవచ్చు.ఈ ఫిల్టర్ద్వారా పిల్లలకు సరిపోయే కంటెంట్ మాత్రమే యూట్యూబ్ లో యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
ముందుగా ఈ ఫీచర్ ను బీటా వెర్షన్ లో యూట్యూబ్ నిపుణులు పరీక్షించిన అనంతరం అధికారికంగా అందుబాటులోకి తీసుకొనిరాబోతున్నట్లు యూట్యూబ్ సంస్థ వారు పేర్కొంటున్నారు.ఈ ఫీచర్ ద్వారా పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో అన్న సందేహానికి చెక్ పెట్టవచ్చు.
చిన్న వయసులోనే పిల్లలు యూట్యూబ్ కి అంకితం అయితే అనేక కష్టాల పాలు అవ్వాల్సి వస్తుంది.కాబట్టి వీలైనంత వరకు మీ పిల్లలకు యూట్యూబ్ నుండి కాస్త దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి.
కేవలం అవసరం మేరకు మాత్రమే యూట్యూబ్ పిల్లలు వీక్షించేలా తగు జాగ్రత్తలు తీసుకోండి.