కొత్త వీవీఐపీ విమానం రెడీ... మరి అందులోని ప్రత్యేకతలు ఏంటంటే..?!

తాజాగా భారతదేశంలోని వీవీఐపీలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తయారు చేయించుకున్న కొత్త విమానం ఢిల్లీకి చేరింది.ఈ విమానాన్ని ప్రధాని మోడీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు.

 The New Vip Aircraft Is Ready And The Special Features Of It Are  Boing Aeroplan-TeluguStop.com

భారతదేశం వాయుసేన పైలెట్లు నడిపే ఈ విమానాన్ని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసినప్పుడు ఈ విమానాన్ని వినియోగించనున్నారు.

అమెరికా అధ్యక్ష విమానానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ విమానాన్ని అత్యాధునిక భద్రత వ్యవస్థతో పొందుపరిచారు.

ఈ విమానానికి క్షిపణుల దాడుల నుండి తట్టుకోగలిగే టెక్నాలజీని రూపొందించారు.అయితే ఈ విమానం జూలై నెలలోనే భారత్ కు రావాల్సి ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో ఈ విమానం భారత్ చేరుకోవడానికి కాస్త ఆలస్యం అయ్యింది.

అయితే ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం రెండు విమానాలను ఆర్డర్ ఇవ్వగా, ప్రస్తుతం ఒక విమానం మాత్రమే ఢిల్లీకి చేరుకోగా మరో రెండు, మూడు రోజుల్లో మరో విమానం కూడా ఢిల్లీకి రానున్నది.

ఇదివరకు వివిఐపిలు అంతర్జాతీయంగా పర్యటనకు వెళ్లేందుకు బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తుందడగా.

తాజాగా ఆస్థానంలో బోయింగ్ 900 విమానాన్ని ఉపయోగించబోతున్నారు.ఇక ఈ విమానం ప్రత్యేకతలు చూస్తే …సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్, ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటుచేసిన సెక్యూరిటీ సిస్టమ్స్, అలాగే ఎలాంటి దాడులు అయినా తట్టుకోగలిగే టెక్నాలజీ, వీటితో పాటుగా శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని సైతం ఆపగలిగే సామర్థ్యం ఈ విమానానికి ఉంది.

అంతేకాదు ఈ విమానం లో ప్రయాణం చేస్తున్న కూడా ఇతరులతో ఆడియో లేదా వీడియో కమ్యూనికేషన్ జరపవచ్చు.ఈ విమానం గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఇందుకు సంబంధించి ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు చేయబడుతుంది.ఈ రెండూ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.8400 కోట్ల రూపాయలను వెచ్చించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube