ప్రణయ్ కేసులో కొత్త ట్విస్ట్..! ప్రణయ్ ఆత్మ మాట్లాడుతుంది అంట.? మారుతీ రావు చంపడానికి అసలు కారణం అదే అంట.?   The New Twist In Amrutha Pranay Case Is Pranay Soul About Maruthi Rao     2018-10-16   12:06:04  IST  Sainath G

అమ్రుత వ్య‌వ‌హారంలో ఇప్పుడో షాకింగ్ సంఘ‌ట‌న వెలుగుచూస్తొంది. ప్రణయ్‌… ఆత్మగా మారిపోయాడా? అతని ఆత్మ అమృత చుట్టే తిరుగుతోందా? పోయిన జన్మలో ప్రణయ్‌, మారుతీరావులిద్దరూ బద్ధశత్రువులా? అందుకే ఈ జన్మలో పగ తీర్చుకున్నాడా? ఇప్పుడివే వదంతులు మిర్యాలగూడలో షికారు చేస్తున్నాయి. కొత్త ముచ్చట్లు హల్‌చల్ చేస్తున్నాయి.

ప్రణయ్‌ భార్య అమృతకు ఇప్పటికీ పరామర్శలు కొనసాగుతున్నాయి. అలా పరామర్శకు వస్తున్న వారిలో కొందరు వింత వ్యక్తులు కూడా ఉంటున్నారు.ఇప్పుడో జంట ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడుతామంటోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు ప్రణయ్‌ భార్య అమృతను పరామర్శించేందుకు వచ్చారు. తాము అమృతతతోప్రత్యేకంగా మాట్లాడాలని పిలిపించుకున్నారు. ఆ తర్వాత ఆత్మ కథ చెప్పడం మొదలుపెట్టారు.ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతోందని వారు చెప్పుకొచ్చారు. వచ్చే జన్మలో కూడా ప్రణయ్‌ నీతోనే జీవించాలనుకుంటున్నాడు అంటూ అమృతకు చెప్పారు. నీకోసం ప్రణయ్ ఆత్మ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఘోషిస్తోందని వివరించారు. ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతోందని… నీతో కూడా మాట్లాడిస్తామంటూ అమృతకు చెప్పారు.

The New Twist In Amrutha Pranay Case Is Soul About Maruthi Rao-

అంతేకాదు..‘మారుతీరావు, ప్రణయ్‌ గత జన్మలో శత్రువులు. ఈ జన్మలో పగ తీర్చుకునేందుకు ప్రణయ్‌ని మారుతీరావు హత్య చేయించాడు. అంతేగానీ అతడిపై మారుతీరావుకు నిజమైన పగలేదు. ప్రణయ్‌ విగ్రహం పెట్టొద్దు. విగ్రహం పెడితే అతడి ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుంది. అప్పుడు మరింత ప్రమాదం. వచ్చే జన్మలో నీతో ఉండాలనే అతడి కోరిక తీరదు’ అంటూ అమృతతో ఆ దంపతులు చెప్పారు. ఆ దంపతుల తీరు, ప్రవర్తనపై అనుమానం రావడంతో అమృత తన కుటుంబసభ్యులను అప్రమత్తం చేసింది. వారు వెంటనే డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో వన్‌టౌన్‌ సీఐ నాగరాజు ప్రణయ్‌ ఇంటివద్దకు చేరుకొని ఆ దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Attachments area

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.