ఆ రాష్ట్రంలో కొత్త రూల్‌.. సార్‌, మేడ‌మ్ అని పిల‌వొద్దట‌

సామాన్య ప్ర‌జ‌లు ఏదైనా పని నిమిత్తం ప్ర‌భుత్వ కార్యాల‌యానికి వెళితే అక్కడ ఆఫీస‌ర్ల‌తో మాట్ల‌డ‌టానికి భ‌య‌ప‌డుతారు.దాంతో ఆఫీస‌ర్ల ద‌గ్గ‌రికి వెళ్లి స‌మ‌స్య‌ను అర్థ‌మ‌య్యే విధంగా చెప్ప‌లేరు.

 The New Rule Kerala Not To Call Sir Or Madam, Kerala, Viral News, Mathur Village-TeluguStop.com

అలాంటి వారి కోసం కేరళలోని ఓ గ్రామం వినూత్నంగా ఆలోచించింది.ఆఫీస‌ర్లు, సామాన్య ప్రజల మధ్య దూరాన్ని త‌గ్గించ‌డానికి సార్, మేడమ్ లాంటి ప‌దాల‌ను వాడొద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది.

కేరళ రాష్ట్రంలోని మథుర్ అనే గ్రామంలో ఈ ఆదేశాల‌ను తీసుకొచ్చింది.ఈ కొత్త నిబంధనతో అంద‌రూ ఆశ్ఛ‌ర్యానికి లోన‌వుతున్నారు.దాంతో దేశంలోనే మ‌థురా ఈ గౌర‌వ ప‌దాల‌ను తీసివేసినన మొదటి గ్రామంగా చ‌రిత్ర‌లోకి ఎక్కింది.అస‌లు విష‌యానికి వ‌స్తే.

సార్ , మేడమ్ అనే పదాల వ‌ల్ల‌ సామాన్య ప్ర‌జ‌ల‌కు, ఆఫీస‌ర్ల‌కు మ‌ధ్య అంత‌రం పెరుగుతుంద‌ని, ఆ అంత‌రాన్ని తీసివేసే విధంగా ఉండాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నామని మథురా గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.

ప్రజాస్వామ్యంలో ప్ర‌జ‌లే కీల‌క‌మ‌న్నారు.పాలించే నేత‌లే ప్ర‌జ‌ల‌కు సేవ‌కుల‌ని తెలిపారు.

వారు ఆఫీస‌ర్ల‌కు మ‌ర్యాద ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.ఆఫీస‌ర్ల‌ను బాతిమాలాడాల్సిన అవ‌స‌రం లేద‌ని, వారి ప‌ని కోసం డిమాండ్ చేయాల‌ని తెలిపారు.

Telugu Common, Democracy, Officers, Kerala, Madam, Mathurgrama, Mathur-Latest Ne

గౌరవ పదాలను తీసివేసిన త‌ర్వాత పంచాయతీ బయట నోటీసులు సైతం పెట్టారు.సార్ మేడమ్ అని పిల‌వ‌క‌పోయినా సమస్యలను అధికారులు ప‌రిష్క‌రిస్తార‌ని అందులో పేర్కొన్నారు.ప్రతి ఒక్క ఆఫీస‌ర్ టేబుల్ పై వారి పేర్లు రాసి బోర్డు పెట్టారు.మేడమ్ సార్ కు కాకుండా అన్న, అక్కా అని ఆఫీస‌ర్ల‌ను పిల‌వ‌వ‌చ్చున‌ని తెలిపారు.

దీని ముఖ్య ఉద్దేశ‌మేమిటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య‌మ‌ని తెల‌పాడానికే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు.ప్రజల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికే అధికారులు ఉన్నార‌ని, వారిని గౌర‌వించ‌డానికి కాద‌ని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube