సక్సెస్‌ కొట్టినా ఈమెకు కాస్టింగ్‌ కౌచ్‌ తప్పడం లేదు..  

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పూత్‌ భారీ విజయాన్ని దక్కించుకుంది. మొదటి చిత్రంతోనే సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న పాయల్‌ ఇక కెరీర్‌లో దూసుకు పోవడం ఖాయం అని అంతా భావిస్తున్నారు. మొదటి సినిమా సూపర్‌ హిట్‌ అయితే కాస్టింగ్‌ కౌచ్‌ ఎదురు కాదు అంటూ గతంలో పలువురు హీరోయిన్స్‌ చెప్పుకొచ్చారు. కాని ఆర్‌ఎక్స్‌ 100 వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని దక్కించుకున్న పాయల్‌కు ఇంకా కూడా కాస్టింగ్‌ కౌచ్‌ తప్పడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా పాయల్‌ రాజ్‌పూత్‌ చెప్పుకొచ్చింది. తాను ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా ఆమె పేర్కొంది.

The New Actress Facing In Casting Coutch Tollywood-

The New Actress Facing In Casting Coutch In Tollywood

పాయల్‌ రాజ్‌ పూత్‌ తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం తర్వాత ఒక సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. ఆ సినిమాలో నటించాలి అంటే వారు చెప్పినట్లుగా వినాలని, నిర్మాత మరియు దర్శకుడిని తృప్తి పర్చాల్సిందే అంటూ వారు డిమాండ్‌ చేశారట. దాంతో తాను ఆ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నట్లుగా పాయల్‌ చెప్పుకొచ్చింది. తన పరిస్థితి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌ను చెబుతుందని ఆమె పేర్కొంది.

టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి రోజు వార్తలు వస్తున్నాయి. అయినా కూడా మరో వైపు ఫిల్మ్‌ మేకర్స్‌ హీరోయిన్స్‌తో అలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు అడిగేవారు లేరు అని వారి అభిప్రాయమా అనేది వారికే తెలియాలి. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోవాలి అంటే కొన్నింటిని వదిలేయాల్సిందే అంటూ కొందరు హీరోయిన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

The New Actress Facing In Casting Coutch Tollywood-

‘ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో బోల్డ్‌గా నటించాను కనుక తాను అలా చేసేందుకు ఒప్పుకుంటాను అని అంతా అనుకుంటున్నారు. అది సినిమా వరకే అని, నిజ జీవితంలో తాను అలా వ్యవహరించబోను అని, వ్యక్తిత్వంను తాకట్టు పెట్టి, అన్ని విధాలుగా అణిగి మణిగి ఉండి హీరోయిన్‌గా రాణించాలని అనుకోవడం లేదని, కాస్టింగ్‌ కౌచ్‌కు తాను వ్యతిరేకం అని, తన ట్యాలెంట్‌ను గుర్తించి ఆఫర్‌ ఇచ్చిన వారితో కలిసి వర్క్‌ చేస్తాను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.