కిడ్నీ, లివర్ కి తేడా తెలియకపోతే ఎలా జ్యోతక్క.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!

శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క తీన్మార్ వార్తల ద్వారా అందరికీ సుపరిచితమే.తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శివ జ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

 Netizens Trolling Shiva Jyothi Dont Know The Difference Between Kidney And Liver Details, Shiva Jyothi, Tollywood, Liver, Kidney, Trolling, Telugu Film Industry, Bigg Boss Shiva Jyothi, Shiva Jyothi Restaurant, Nalli Bokkala Daawat, Shiva Jyothi Trolled-TeluguStop.com

కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా ఉన్నటువంటి శివ జ్యోతి బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.బిగ్ బాస్ అనంతరం ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాల్లో చేస్తూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే రంజాన్ పండుగ సందర్భంగా గత నెల క్రితం శివ జ్యోతి పిస్తా హౌస్‌ రెస్టారెంట్‌ ప్రకటించిన అన్‌లిమిటెడ్‌ బఫెట్‌ గురించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేశారు.

 Netizens Trolling Shiva Jyothi Dont Know The Difference Between Kidney And Liver Details, Shiva Jyothi, Tollywood, Liver, Kidney, Trolling, Telugu Film Industry, Bigg Boss Shiva Jyothi, Shiva Jyothi Restaurant, Nalli Bokkala Daawat, Shiva Jyothi Trolled-కిడ్నీ, లివర్ కి తేడా తెలియకపోతే ఎలా జ్యోతక్క.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే నల్లి బొక్కల దావత్ వీడియో అంటూ ఈ వీడియోని యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకున్నారు.

ఇక ఈ వీడియోలో భాగంగా రెస్టారెంట్ లో ఉన్న వంటకాల గురించి వివరిస్తూ వచ్చారు.

అయితే శివ జ్యోతి మటన్ లివర్ ను ఉద్దేశిస్తూ కిడ్నీ అని చెప్పుకొచ్చారు.కిడ్నీ అంటే చాలా గలీజ్ గా ఉంటుందనీ మటన్ లివర్ అని చెబుతుంది.అయితే తన పక్కనే ఉన్న తన భర్త గంగూలీ మాత్రం కిడ్నీ వేరు, లివర్ వేరు అని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజన్లు ఒక న్యూస్ రీడర్ అయ్యుండి కిడ్నీకి, లివర్ కితేడా తెలియకపోతే ఎలా జ్యోతక్క అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.మొత్తానికి శివజ్యోతి కిడ్నీ, లివర్ అంటూ అడ్డంగా దొరికిపోయారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube