ఫిమేల్ అమీర్ ఖాన్ అంటూ ఆ నటికి కితాబు ఇచ్చిన నెటిజన్లు.. ఎందుకంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Netizens Gave Kriti Sanon As Female Ameer Khan Details, Kriti Sanon, Bollywood,-TeluguStop.com

ఇలాంటి స్టార్డమ్ ఉన్న హీరోతో నెటిజన్లు బాలీవుడ్ హీరోయిన్ ని పిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.అలాంటి స్టార్ హీరోతో పోల్చిన ఆ హీరోయిన్ ఎవరు.? ఫిమేల్ అమీర్ ఖాన్ అంటూ ఆ నటిని పిలవడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కృతిసనన్ నటించిన మిమి చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

ఇందులో ఈమె పెళ్లి కాకుండానే సరోగసీ ద్వారా బిడ్డను కనే పాత్రలో కనిపించింది.ఇలా గర్భవతిగా కనిపించడం కోసం తన పాత్రలో సహజ సిద్ధంగా ఉండాలని ఈ బ్యూటీ ఏకంగా 15 కిలోల బరువు పెరిగింది.

Telugu Bollywood, Kriti Sanon, Kritisanon, Netizens, Pregnant Role-Movie

ఇలా పాత్ర కోసం బరువు పెరగడంతో నెటిజన్లు ఈమెను ఏకంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో పోలుస్తూ ఫిమేల్ అమీర్ ఖాన్ అంటూ ఈమె పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ విషయంపై స్పందించిన కృతిసనన్ తనను అమీర్ ఖాన్ తో పోల్చవద్దని అతనితో పోల్చుకునే స్థాయి తనది కాదని ఆ పాత్ర చేసినందుకు ప్రతి ఒక్కరు అభినందిస్తే చాలని ఈమె తెలిపారు.ఇక ఈ పాత్ర కోసం తను బరువు పెరగడంతో ప్రస్తుతం ఆ బరువు తగ్గడం కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుందో ఒక వీడియో ద్వారా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube